సైబర్ నేరగాళ్ల ఆగడాలు కొత్తేమీ కాదు. నకిలీ ఖాతాలను తెరచి సొమ్ము చేసుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రముఖుల పేరుపై నకిలీ ఖాతాలు క్రియేట్ చేయడం అనంతరం లక్షల్లో కొట్టేయడం వారికి సదా మామూలే. అయితే ఈ సారి ఏకంగా కలెక్టర్ పేరుపైనే నకిలీ ఖాతాను సృష్టించి టోపీ పెట్టేసారు. తాజాగా ఓ కలెక్టర్ పేరుపై నకిలీ వాట్సాప్ ఖాతాను క్రియేట్ చేసిన ఓ సైబర్ నేరగాడు అక్షరాల రూ. 2.40లక్షలు నగదును కొట్టేశాడు. ఆ సైబర్ నేరగడు ఎంత నాజూగ్గా డబ్బులు దోచేశాడు అంటే, కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్ ఖాతాను క్రియేట్ చేసిన ఆ సైబర్ నేరగాడు సన్నిహితమైన పలువురు అధికారులకు ఆ వాట్సాప్ ఖాతా నుండి తాను షాపింగ్ చేస్తున్న సమయంలో అర్జెంట్ గా డబ్బు అవసరం పడింది అని... వెంటనే రూ 2.40 నగదు ను ట్రాన్ఫర్ చేయమని కోరాడు.

అయితే అది నమ్మిన ఆ జిల్లా అధికారి ఒకరు విడతలు వారీగా రూ. 2.40 లక్షలను ఆ ఖాతాకు బదిలీ చేశారు. అయితే అనుమానం వచ్చి క్రాస్ చెక్ చేయగా విషయం అర్దం అయ్యింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా... మెసేజ్ చేసింది కలెక్టర్ కాదని ఝార్ఖండ్ కు చెందిన సైబర్ నేరగాడని తేల్చి చెప్పారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  నారాయణపేట జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. టెక్నాలజీ పెరగడం వలన యువత భవిష్యత్తు కూడా మెరుగుపడుతుంది. దేశ భవిష్యత్తును టెక్నాలజీ నిర్ణయిస్తుంది అనడం ఒక పాయింట్ అనే చెప్పొచ్చు.

అయితే టెక్నాలజీని వినియోగించుకుని ఎందరో అద్భుతాలు సృష్టిస్తుంటే  ,అందరికీ ఉపయోగపడే మంచి పనులు చేస్తుంటే కొందరు మాత్రం ఇది టెక్నాలజీని తమ స్వలాభం కోసం చెడుకు వినియోగిస్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెడుతూ కొందరు దోచుకుంటూ కొందరు తమ స్వార్దం తాము చూసుకుంటున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అయితే అడ్డు అదుపు లేకుండా పోతోంది. అసలు ఎవరూ ఊహించని రీతిలో తమ చాకచక్యం చూపిస్తున్నారు. ఈ దారి కాకపోతే మరో దారి అన్నట్టు ఒక మోసం బయట పడితే మరో కొత్త కోణంలో ప్లాన్ చేస్తూ తమ చేతివాటం చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: