ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అటు మహిళలపై లైంగిక వేధింపులు మాత్రం ఆగడం లేదు అన్న విషయం తెలిసిందే. నేటి రోజుల్లో ఆడపిల్లలు సభ్య సమాజాన్ని ఎదిరించి.. ఆడపిల్ల అంటే వంటింటికి  మాత్రమే పరిమితం కావాలి అనే భావనను పటాపంచలు చేస్తూ చదువుల్లో పురుషులతో సమానంగా రాణించడమే కాదు ఉద్యోగాల్లో కూడాఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. ఇలా నేటి రోజుల్లో ఆడపిల్ల వేస్తున్న ప్రతి అడుగు కూడా మహిళా సాధికారతవైఫై అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా పురుషులు సైతం కుటుంబ బాధ్యతలు వదిలేస్తూ ఉంటే.. మహిళలు సైతం కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని ఎంతో కష్టపడి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నవారు కూడా చాలామంది ఉన్నారు.


 ఇలా సభ్య సమాజంలో మహిళల వివక్షను రూపు మాపి ఎంతో ధైర్యంగా బ్రతుకుతున్న ఆడపిల్లలకు కొంతమంది కామందుల మాత్రం అడుగడుగునా వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏదైనా ఉద్యోగం లో ఆడపిల్లలకు పదోన్నతి కావాలి అంటూ అడిగితే ఏకంగా పక్కలోకి రమ్మంటున్న వారు నేటి రోజుల్లో ఎక్కువైపోయారు. ఇక ఇలాంటి వేధింపులు తట్టుకోలేక ఎంతోమంది మహిళలు మనస్తాపంతో ఆత్మహత్యచేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఓ మహిళకు ఉన్నతాధికారుల నుంచి ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయి.


 మెదక్ జిల్లా సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఒక అధికారి ఒప్పంద  విధానంలో అదే విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేయడం సంచలనంగా మారిపోయింది. తన ఉద్యోగాన్ని కొనసాగించే పత్రాల మీద సంతకం పెట్టాలి అంటూ సదరు మహిళా ఉద్యోగిని అడిగేందుకు వెళ్లగా ఇక ఆమెతో దుర్భాషలాడుతూ అధికారి తీవ్ర మనోవేదనకు గురి చేశాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పిన ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదు అంటూ సదరు మహిళా  ప్రశ్నిస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: