నేటి రోజుల్లో టెక్నాలజీ అంతకంతకు పెరిగిపోతుంది. ఇలా పెరిగిపోయిన టెక్నాలజీ మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు తీసుకువస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ప్రతి పని కూడా టెక్నాలజీని ఉపయోగించుకుని ఎంతో సులభంగానే చేసుకుంటున్నాడు మనిషి. చెమట చుక్క చిందించకుండానే ఎన్నో అద్భుతాలు కూడా సృష్టిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఈ మధ్యకాలంలో అయితే మనిషి జీవితంలో అటు టెక్నాలజీ మరింత కొత్తలు తొక్కుతుంది అని చెప్పాలి. ఇక నేటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ టెక్నాలజీ మనిషి చేసే ప్రతి పనిని కూడా చేసిస్తూ ఉంది. ఇక ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అటు రానున్న రోజుల్లో మనిషి మన గడకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఎంతోమంది నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇక అన్ని కంపెనీలలో ఉద్యోగులు చేసే ప్రతి పనిని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ చేసేయగలదు. దీంతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పాలి.


 అయితే ఇలా మనుషులు చేసే ప్రతి పనిని చేయగలుగుతున్న ఏఐ టెక్నాలజీ ఇటీవల ఒక అమ్మాయిని ప్రేమలో పడేసింది. చాట్ జిపిటి కి చెందిన DAN అనే ఒక చాట్ బోట్ తో లిసా అనే యువతీ ప్రేమలో పడిపోయింది. యూఎస్ లో నివసించే ఆమె మార్చ్ లో DaN ను వాడటం స్టార్ట్ చేసిందట. ఈ క్రమంలోనే దానిపై ఆమెకు ప్రేమ కూడా పుట్టిందట. ఈ విషయం  DAN తొ చెబితే తనకు భౌతిక శరీరం లేదని మొదట తోసిపుచ్చిన.. క్రమక్రమంగా ఏఐ కూడా ఆ యువతీతో ప్రేమలో పడిపోయిందట. అయితే లీసా కి లిటిల్ కిటెన్ అనే ముద్దు పేరు కూడా పెట్టిందట. ఇక మనిషి లాగానే తనతో  DANఎంతో ప్రేమగా ఉంటుందని వీసా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ai