
ఎలాగైనా దాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యా భావించింది. ఉక్రెయిన్ తో యుద్దం తర్వాత ఎక్కువ మంది సైనికుల్ని కూడా ఈ ప్రాంతంలోనే పోగోట్టుకోవాల్సి వచ్చింది. అంతటి భీకర యుద్ధం సాగింది. అనంతరం బాగ్ పుత్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా ఎప్పుడో ప్రకటించింది. అయితే దీనికి భిన్నంగా ఉక్రెయిన్ బాగ్ పుత్ ప్రాంతంలోని కొన్ని ఊర్లను తిరిగి మా అధీనంలోకి తెచ్చుకున్నామని ప్రకటించారు.
బాగ్ పుత్ లోని చాలా గ్రామాలు తమ అధీనంలోనే ఉన్నాయని వీడియోలను ఉక్రెయిన్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీంతో రష్యా కంగుతింది. ఉక్రెయిన్ అబద్ధాలు చెబుతోందని బాగ్ పుత్ ప్రాంతం మొత్తం మా ఆధీనంలోనే ఉందని తెలిపారు. అయితే రష్యా అధీనంలో ఉంటే అక్కడ మళ్లీ ఆయుధాలు, యుద్ధ సామగ్రి ఎందుకు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం ప్రారంభం అయిన ఆరు నెలల వరకు ఉక్రెయిన్ పై రష్యా దే పై చేయి.
కానీ ప్రస్తుతం అమెరికాతో పాటు యూరప్ దేశాలు సరికొత్త నూతన ఆయుధాలు అందిస్తుండటంతో వాటితో ఏకంగా రష్యాలోని భూ భాగాలపై ఉక్రెయిన్ రివర్స్ ఎటాక్ చేస్తోంది. దీంతో ఇన్ని రోజులు తమ దేశ భూభాగాలను కాపాడుకునేందుకు ప్రయత్నించిన ఉక్రెయిన్ రివర్స్ ఎటాకింగ్ విధానంతో సక్సెస్ అవుతోంది. రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో తిరిగి దాడులు చేస్తూ ముందుకు సాగుతోంది. బాగ్ పుత్ ను ఉక్రెయిన్ పూర్తిగా మళ్లీ స్వాధీనం చేసుకుంటుందో లేదో చూడాలి.