మందలగిరి మాలోకం, పప్పు, చినబాబు ఇలా ఎన్ని ముద్దు పేర్లతో పిలుచుకుంటూ చంద్రబాబు తనయుడు లోకేష్ ను ఎలాగైతేనేం ప్రపంచ మేధావిగా తీర్చిదిద్దే పనిలో చందా బాబు బాగానే సక్సెస్ అయ్యారు. అయితే చినబాబు పెరఫామెన్స్ ఏంటో ఎవరికీ తెలియంది కాదు. మైకు పట్టుకోవడానికి గజ గజ వణికిపోవడమే కాదు. తప్పకుండా మాట్లాడితే పార్టీ కొంప ఏ విధంగా ముంచాలో ఆ విధంగా ముంచుతూ సినబాబు తన ఫెరఫామెన్స్ నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఈ ప్రపంచ మేధావి తెలివి తేటలు బాగా తెలుసు కాబట్టే కదా చంద్రబాబు ఆయన్ను ఇంటికే పరిమితం చేసేసి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టుకుంటూ కూర్చోమన్నాడు. ఇక తన ప్రపంచ స్థాయి తెలివితేటలను ట్విట్టర్ లో ప్రదరిస్తూ పరపతి పెంచుకోవాలనుకుంటే... అది కాస్తా రివర్స్ అటాక్ ఇస్తోంది. 

 

ఈ చంద్రబాబు తరువాత సినబాబే కదా యువరాజు అయ్యేది ... టీడీపీని ఏలేది ? ఇప్పటి నుంచే తన వీర పెతాపం చూపించేందుకు ట్విట్టర్లో ఓ రేంజ్ లో రెచ్చిపోతూ పోస్ట్ లు పెడుతున్నాడు. మొన్నటివరకు ఎలా ఉన్నా ఇప్పుడు లోకేష్ ఓ కొత్త ట్రైనర్ ను పెట్టుకున్నాడు. పంచులు, ప్రాసలు, పాటలు ఇలా అన్నీ మిక్స్ చేసి మరీ ట్విట్స్ పెడుతున్నాడు చినబాబు. నిన్నో మొన్నో ట్విట్టర్ లో పెట్టిన ట్విట్స్ చూస్తే లోకేష్ పెద్ద మనిషి అయ్యాడు అనే విషయం అర్ధం అయిపోతోంది.లోకేష్ తెలివి తేటలు చూసి ఇప్పుడు నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి ఆ పార్టీ నాయకులతో పాటు తెలుగు ప్రజలందరికీ వస్తోంది. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు లోకేష్ మారతాడు అని భావించిన వారికి ఇప్పుడు లోకేష్ మరింత దిగజారి పోయాడు అనే విషయం అర్థమవుతుంది. 

 

ప్రసంగాల్లో తప్పులను ఇప్పటికీ సరి చేసుకోలేకపోతున్నారు. ఏ సందర్భంలో ఏ విషయం మాట్లాడాలో, ఇప్పటికీ లోకేష్ తెలుసుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు లోకేష్ మీద జనాలకు సానుభూతి ఉన్నా ఇప్పుడు మాత్రం అది కనిపించడం లేదు. దీనికి కారణం లోకేష్ తన ట్విట్టర్ లలో అభ్యంతరకరంగా పోస్ట్లు పెట్టడమే. ఏపీ లో పనిచేస్తున్న లక్షల మంది వాలంటీర్లను ఉద్దేశించి దండుపాళెం గ్యాంగుల అని, రేపిస్టు అంటూ విమర్శలు చేశారు. ఇక అందులోనూ 90 శాతం మంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారని లోకేష్ తన ట్విట్టర్ లో బాధపడిపోయాడు. ఒకరు ఇద్దరు తప్పు చేస్తే మొత్తం నాలుగు లక్షల మందిని కించపరుస్తూ మాట్లాడడంతో లోకేష్ ను కూడా సోషల్ మీడియాలో అదే రేంజ్  తిట్టిపోస్తున్నారు జనాలు. 

 

నిజంగా వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సేవలు అందుతున్నాయి. మంచానికే పరిమితమైన వృద్ధులు, వికలాంగులకు వారు ఉంటున్న చోట కి పెన్షన్ తీసుకువెళ్ళు ఇవ్వడం ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజలకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని వివరాలు చెప్పడం వారికి అవి అందేలా వీరు విధులు నిర్వర్తిస్తున్నారు.  అటువంటి వ్యవస్థలో చిన్నాచితక లోపాలు ఉన్నా చిన్నా చితకా  విమర్శలు చేయాలి తప్ప అసభ్యకరంగా కించపరుస్తూ మాట్లాడడం తగదు.  అదికూడా కాబోయే టిడిపి అధ్యక్షుడి హోదాలో ఉన్న లోకేష్ మాట్లాడడం వల్ల ఆయనపైనా తెలుగుదేశం పార్టీ ఉన్న పైన ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నాయి. రోజు రోజుకి పరపతి పెంచుకోవాల్సిన లోకేష్ లాంటి వ్యక్తులు దిగజారుడు గా మాట్లాడుతూ ప్రజలను, వ్యవస్థలను విమర్శిస్తూ తన పరపతిని పాతాళానికి దిగజార్చు కుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: