జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా ఏపీ సర్కారుతో కొన్ని విబేధాలు తలెత్తాయి. ఈ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతించ లేదు.. టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతించలేదు.. అయితే ఇందుకు ఏపీ సర్కారు అనేక నిబంధనలను సాకుగా చెబుతోంది. కానీ జనసేన నాయకులు మాత్రం పవన్ కల్యాణ్‌పై కక్షతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అయితే ఇంతగా వకీల్ సాబ్ సినిమాను టార్గెట్ చేయడానికి ప్రధానంగా మూడు అంశాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది.. పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టి.. ఆ ఫ్యాన్స్ కంట్రోల్‌ తప్పితే.. దాన్ని నియంత్రణ లేని మూకగా ప్రజల ముందు నిలెబెట్టడం అన్నది ప్రధానంగా కనిపిస్తోంది. సాధారణంగానే పవన్ ఫ్యాన్స్ అంటేనే కాస్త ఎమోషనల్ గా ఉంటారు. ఇక తమ హీరో సినిమాకు అడ్డంకులు కల్పిస్తే సహజంగానే వారు వైల్డ్‌ గా రియాక్టవుతారు. అలాంటి ఘటనల ఆధారంగా జనసేనపై ఓ ముద్ర వేసే ప్రయత్నం జరిగిందన్నది ఓ వాదన.

మరో విషయం ఏంటంటే.. తిరుపతి ఉపఎన్నికలలో అటు టీడీపీ, బీజేపీ-జనసేన రెండు విడిగా పోటీ చేస్తున్నాయి. ఈ పోటీలో బీజేపీ-జనసేన వీక్‌గా ఉంటే.. అది టీడీపీకి లాభిస్తుంది. ఎందుకంటే రాయలసీమలో బలిజ సామాజిక వర్గం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి వరకూ వీరంతా బలంగా టీడీపీకి అనుకూలంగా ఉంటూ వచ్చారు. జనసేన వచ్చిన తర్వాత వారు పవన్ వైపు మళ్లుతున్నా అది పూర్తిగా జరగడం లేదు.  

అలా పవన్ ఫ్యాన్స్‌ను ఏకం చేయాలంటే ఇలాంటి అడ్డంకులు సృష్టించాలి.. అలా జరిగితే.. బలిజ సామాజిక వర్గం అంతా ఏకమైన బీజేపీ-జనసేనకు ఓట్లేస్తుంది. అది టీడీపి ఓట్లను గణనీయంగా తగ్గిస్తుంది.. ఇదీ మరో వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఈ వ్యుహాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: