
ఐఎస్ఐ గత కొన్నేళ్ల కిందట ఎంతో మంది మత పెద్దల ద్వారా, యువతను రెచ్చగొట్టి దేశంలో దాడులు జరిగేలా చూడటం. హైదరాబాద్, ముంబాయి పేలుళ్ల కేసులో కూడా దేశం లోనే యువతే పాల్గొన్నారు. ఐఎస్ఐ డీజీ తన మార్కును అందుకోలేకపోతున్నాడు. కాబట్టి అతడిని తీసేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్కువగా కుట్రలు చేసి భారత్ లో అలజడులు సృష్టించలేని వ్యక్తి ఐఎస్ఐకి అనర్హుడని పాక్ అభిప్రాయం. కానీ గతంలో కాంగ్రెస్ హయాంలో మైనార్టీ ఓట్ల కోసం కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించిన వారిని సైతం చూసీ చూడనట్లు వ్యహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎన్నో ప్రాంతాలు మత విద్వేషాలు, బాంబు దాడులు జరిగాయి. దీనికి పరోక్షంగా కారణం ఐఎస్ఐ.
భారత్ లో అశాంతిని రేపేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం దాని పాచికలు పారడం లేదు. దేశంలో విస్తృతమైన తనిఖీలు, బలమైన నిఘా వ్యవస్థతో దాడులను దేశ ఇంటిలిజెన్స్ విభాగం ఎక్కడికక్కడ అడ్డకుంటుంది. ఏదైమైనా పాక్ లో బలంగా పని చేయాల్సిన ఐఎస్ఐ మన దేశంలో అమాయక యువతపైనే దృష్టి పెడుతోంది. దీన్ని మానుకుంటేనే పాక్ కు, ఐఎస్ఐకు మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.