
నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్ టూ ఏ.జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చీఫ్ సాగా మాథ్యూ నార్డ్ స్ట్రీమ్ విధ్వంసం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిలో ఒక నాటో సభ్యుని ప్రమేయాన్ని సూచించాడు. ఒక నాటో సభ్యుడి హస్తం రహస్యంగా దాని వెనుక ఉందని అన్నాడు. గత సంవత్సరం సెప్టెంబరులో జరిగిన పేలుళ్ల గురించి ఆలోచించమని చెప్పాడు. ఆ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెప్పింది ఏమిటంటే ఈ పైప్ లైన్ విధ్వంసం వెనుక ఒక నాటో సభ్యత్వ దేశం ఉందని చెప్పి, అది ఎవరో మీరే ఆలోచించండి అని ఆయన ఒక కీలకమైన సంకేతాన్ని ఇచ్చాడు.
ఒక రకంగా చెప్పాలంటే ఉక్రెయిన్, పోలాండ్ ఈ రెండూ నాటో సభ్యత్వ దేశాలు కాదు. వీరు విడివిడిగా ఈ పని చేసే అవకాశం లేదు. అందుకనే ఈ పని వీరందరి సహకారం వల్లే జరిగి ఉంటుందని అక్కడ సమాచారం. రష్యా మీదకు చిన్న దేశమైన ఉక్రెయిన్ ను ఎలా ఉసిగొలిపి యుద్ధానికి పంపిందో, అలాగే అమెరికా ఇక్కడ చాలా తెలివిగా నాటోలో ఉన్న చిన్న దేశాలతో ఈ పనిని చేయించిందని తెలుస్తుంది. పక్క దేశాన్ని వాళ్ల అవసరాల రీత్యా నడుపుతుంది అమెరికా. అమెరికాని నమ్మి బ్రతుకుతున్న చిన్న దేశాలకు కనువిప్పు ఎప్పుడు కలుగుతుందో.