తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు ఏర్పాటు చేసి బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని కేసీఆర్‌ ప్లాన్‌ చేశారా.. అనుకోకుండా ఆ వ్యూహం ఫలించలేదా.. అవునంటున్నారు. తెలంగాణ పోలీసులు.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో జరుగుతున్న విచారణలో ఇలాంటి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బిఎల్ సంతోష్ ను అరెస్టు చేసి లిక్కర్ కేస్ లో కవిత  అరెస్ట్ కాకుండా భాజపా అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుదామని అనుకున్నట్టు డీసీపీ రాధాకిషన్‌రావు వెల్లడించారు.


కొంతమంది అధికారుల అసమర్థత  కారణంగా సంతోష్ ను అరెస్టు చేయలేకపోయామని డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. పలువురు అధికారులను కేరళకు పంపించినా, ఆ ప్రణాళిక ను విజయవంతం చేయలేదన్న డీసీపీ రాధాకిషన్‌రావు.. సంతోష్ ను అరెస్టు చేయలేకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు వివరించారు. కెసిఆర్ తో ఉన్న అనుబంధం కారణంగా ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేనని డీసీపీ రాధాకిషన్‌రావు వివరించనట్లు సమాచారం.


అవును.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావు వాగ్మూలం ఆధారంగా  దర్యాప్తు బృందం పలు అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంబంధించి ఆసక్తికర విషయాలను కస్టడీ విచారణలో రాధాకిషన్ రావు వెల్లడించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంపై ఎస్ఐబీ మాజీ ఛీప్ ప్రభాకర్ రావు తనతో చర్చించారని ఆయన దర్యాప్తు బృందానికి రాధాకిషన్ రావు వివరించారు. పైలెట్ రోహిత్ రెడ్డి తోపాటు పలువురు ఎమ్మేల్యేలను భాజపాలో చేర్చాలని అగ్రనేతలను సంప్రదించారని తెలిసింది.  


భాజపాకు చెక్ పెట్టేందుకు వారిపై గట్టి నిఘా  పెట్టాలని కేసిఆర్ ఎస్ఐబికి చెప్పారని రాధాకిషన్ రావు  పోలీసులకు వివరించారు. భాజపా అగ్ర నేతల ఫోన్లను ప్రణీత్ రావు బృందం పోన్ ట్యాపింగ్ చేసిందని తెలిపాడు.  ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక ఆడియో టేప్ ను కెసిఆర్ కు పంపించామని వివరించారు. దీంతో ట్రాప్ చేయాలని కెసిఆర్ తమను ఆదేశించారని వివరాలను వెల్లడించారు. స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ టీంను ఢిల్లీకి పంపించారని తెలిపారు. ట్రాప్ కు ఒకరోజు ముందు కెమెరాలను ఫామ్ హౌస్ లో అమర్చామని తెలిపారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలను అందులో పాలుపంచుకోవాల్సిందిగా కేసీఆర్ చెప్పాడని రాధాకిషన్ రావు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: