
అంతేకాదు.. నువ్వు రాజకీయాలు ఎలా చేస్తావో చూస్తా.. అంటూ.. అప్పటి మంత్రి రజనీ చేసిన శపథం కూడా.. ప్రత్తిపాటిని తీవ్రంగా ఇరుకున పడేసింది. వెంట వచ్చే కార్యకర్తలను వైసీపీ నాయకులు బెదిరించా రు. నాయకులపై పోలీసులు కేసులు పెట్టారు. అడుగు తీసి అడుగు వేస్తే.. ఎటు నుంచి ఎలాంటి కేసులు ముసురుకుంటాయోనన్న బెంగ.. మరోవైపు.. దాడులు.. అవినీతి చేశారంటూ.. ఆరోపణలు.. వెరసి.. 2022-24 మధ్య రెండు సంవత్సరాల పాటు.. ప్రత్తిపాటికి ఊపిరి సలపలేదనే చెప్పాలి.
అయినా.. ప్రత్తిపాటి పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేశారు. సీఎం చంద్రబాబు నుంచి వచ్చిన దన్ను ఆయనను విజృంభించేలా చేసింది. `ఏం చేస్తారో.. చేసుకోండి. ఎన్ని కేసులు పెడతారో.. పెట్టుకోండి` అంటూ... ప్రత్తిపాటి ప్రజల మధ్యకువచ్చారు. ఊరూ వాడాతిరిగారు. గ్రామాలను జల్లెడపట్టినట్టు పాదయాత్రలు కూడా చేశారు. ఈ క్రమంలోనే 2024లో విజయం దక్కించుకున్నారు. ప్రజల మనసులు చూరగొని వారికి చేరువ అయ్యారు. ఇలా.. తనకంటూ.. ప్రత్యేకతను సంతరించుకున్నారు.
ఇక, ఎవరైతే.. తనను గతంలో ఎదిరించారో.. బెదిరించారో.. ఇప్పుడు వారినే ఇరకాటంలో పడేసేలా చేయడంలో ప్రత్తిపాటి వ్యూహాత్మక అడుగులు వేశారు. గతంలో తనను కార్నర్ చేసిన.. విడదల రజనీ ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నారు. జైలా.. బెయిలా.. అన్నట్టుగా ఆమె మారిపోయారు. అంతేకాదు... ప్రజల్లోనూ ఆమె చేసిన వ్యవహారాలను జోరుగా తీసుకువెళ్లడంలో ప్రత్తిపాటి సక్సెస్ అయ్యారు. ఫలితంగా నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు ఆమెను తిరస్కరించడమే కాదు.. అసహ్యించుకునే పరిస్థితికి వచ్చింది. ఇలా.. ప్రత్తిపాటి.. చిలకలూరిపేట రాజకీయాల్లో ఘనాపాటిగా నిలిచారని.. ఆయన హార్డ్ కోర్ అభిమానులు చెప్పుకొంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు