
గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం నుంచి గెలిచిన వారిలో చాలామంది మహిళ నాయకులు ఉన్నారు. వీరిలో సీనియర్లు , జూనియర్లు కూడా ఉన్నారు. చంద్రబాబు తన క్యాబినెట్లో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించారు. హోం మంత్రి వంగలపూడి అనిత పాటు గుమ్మడి సంధ్యారాణి - సవితమ్మకు మంత్రులుగా అవకాశం కల్పించారు. అయితే సంధ్యారాణి , కవితమ్మ లాంటి వాళ్ళు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులు అయిపోయారు. అయితే పార్టీలో సీనియర్ మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారికి మంత్రులుగా అవకాశం రాలేదు. తర్వాత జరిగే మార్పులు చేర్పుల లో కచ్చితంగా వారికి మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తర్వాత జరిగే మార్పులు చేర్పులలో కచ్చితంగా మంత్రి పదవి సొంతం చేసుకుంటారు అని టిడిపి వర్గాలలోనే ప్రచారం జరుగుతుంది.
ఇటీవల ఆమె లా సెట్ లో మంచి ర్యాంకు సాధించారు. చంద్రబాబు ఇచ్చే టాస్క్‌ల ను పూర్తి చేయడంతో పాటు నియోజకవర్గంలోనూ ఎలాంటి వ్యతిరేకం లేకుండా ప్రజల అభిమానం సంపాదించుకున్నారు. తంగిరాల సౌమ్య ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సీనియర్లకు - జూనియర్లకు మధ్య సమన్వయంతో వ్యవహరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఎప్పుడు పార్టీ లైన్ దాటలేదు. ఈ క్రమంలో ఆమె కచ్చితంగా చంద్రబాబు మంత్రులను మారిస్తే ఖచ్చితంగా చోటు దక్కించుకుంటారని టిడిపి సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆమెకు త్వరలోనే చంద్రబాబు అదిరిపోయే ఎలివేషన్ ఇవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు