భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖల హాస్పిటల్స్/డిస్పెన్సరీల్లో 29 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది... సీనియర్ మెడికల్ ఆఫీసర్.. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది..

 Image result for bhel notification 2018

పోస్టు-ఖాళీలు:  సీనియర్ మెడికల్ ఆఫీసర్ (ఎస్‌ఎంవో)-12 (మెడిసిన్-3+జనరల్ సర్జరీ-4+రేడియాలజీ-2+ పీడియాట్రిక్స్-1+ఆప్తాల్మాలజీ-1+ ఈఎన్‌టీ-1); జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (జీడీఎంవో)-17.

వేతనశ్రేణి: ఎస్‌ఎంవో-రూ.29,100-రూ.54,500; జీడీఎంవో-రూ.24,900-రూ.50,500. 

అర్హతలు: ఎస్‌ఎంవోకు ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత విభాగంలో పీజీ, ఏడాది అనుభవం; జీడీఎంవోకు ఎంబీబీఎస్‌తోపాటు ఏడాది అనుభవం. 

వయసు: 2018, మార్చి 1 నాటికి ఎస్‌ఎంవోకు 37 ఏళ్లు; జీడీఎంవోకు 32 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక: ఎస్‌ఎంవోకు ఇంటర్వ్యూ; జీడీఎంవోకు అభ్యర్థుల సంఖ్యను బట్టి రాతపరీక్ష/ఇంటర్వ్యూ.

దరఖాస్తు రుసుం: రూ.300; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మాజీ సైనికోద్యోగ కేటగిరీలకు ఫీజు లేదు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకొని, అక్నాలడ్జ్‌మెంట్‌కు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు జతచేసి గడువులోగా చేరేలా పంపాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 16, 2018.

హార్డ్‌కాపీ చేరడానికి చివరి తేదీ: ఏప్రిల్ 23, 2018.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.bhel.comwww.bhelbpl.co.in


మరింత సమాచారం తెలుసుకోండి: