తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో 121 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు విధానం ఇప్పటికే మొదలైంది కూడా. అప్లై చేయడానికి చివరి తేదీ ఆగస్టు 13.
UPSC Recruitment : #govtjobs : government #jobs : govt jobs in #AllIndia : The Union Public service Commission, Inviting online application form for the post of Medical Officer, Research Officer, Specialist, Architect & more. Total post 121.
— Lucky-Jobs Update (@Jobs_Lucky) July 26, 2020
More Details-https://t.co/ES2SKg8nOL
ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాల కోసం https://upsc.gov.in/ అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన వారు https://www.upsconline.nic.in/ ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోగలరు. ఇక ఈ 121 పోస్టులలో మెడికల్ ఆఫీసర్ 36 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ 3 పోస్టులు, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ 60 పోస్టులు, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 21 పోస్టులు గా భర్తీ చేయనున్నారు.
ఇందుకు సంబంధించి విద్యార్హతలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. ఇక ఈ అప్లికేషన్ గాను దరఖాస్తు ఫీజు కేవలం 25 రూపాయలు మాత్రమే. అలాగే ఎస్సీ, ఎస్టీ, మహిళలకు, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి