ఏకంగా 8500 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. దేశంలోని వేర్వేరు జోన్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోస్టులు ఉన్నాయి. ఇవి మూడేళ్ల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. వీరిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులుగా గుర్తించరు. ఈ విధానం ద్వారా ఎంపికైన వారికి మూడేళ్ల పాటు అన్నీ వసతులను కల్పించి ట్రైనింగ్ ను ఇస్తారు.డిగ్రీ అర్హతతో 2000 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 డిసెంబర్ 4 చివరి తేదీ.https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers సైట్ లలో చెక్ చేసుకోవాలని కోరారు..
భారత దేశ వ్యాప్తంగా ఉన్న ఖాళీలు .. 460 కాగా, ఆంధ్రప్రదేశ్ లో 620 ఉన్నాయి..దేశవ్యాప్తంగా 8500 ఖాళీలు ఉన్నాయి.ఈ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల 20 కాగా , దరఖాస్తులు చేసుకొనే చివరి తేదీ మాత్రం డిసెంబర్ 10 వ తేదీ..ఆన్‌లైన్ ఫీజు పీమెంట్- 2020 నవంబర్ 20 నుంచి డిసెంబర్ 10
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 డిసెంబర్ 25..మిగిలిన అంశాలను చూస్తే..
వయస్సు- 2020 అక్టోబర్ 31 నాటికి 20 నుంచి 28 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు
ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- రాతపరీక్ష, స్థానిక భాషలో పరీక్ష.
స్టైపెండ్- మొదటి ఏడాది నెలకు రూ.15,000. రెండో ఏడాది నెలకు రూ.16,500. మూడో ఏడాది నెలకు రూ.19,000. ఇతర అలవెన్సులు ఉండవు..
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరుతున్నారు...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి