ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా తరగతులు వెనకపడతంతో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవడం చేస్తున్నారు. రేపటి నుంచి స్కూల్స్ పూర్తి దశలో మొదలు కానున్నాయి. అసలు విషయానికొస్తే.. విద్యార్థులు కొన్ని సబ్జెక్ట్ లలో స్ట్రాంగ్ గా ఉంటే మరీ కొన్ని సబ్జెక్ట్ లలో వీక్ గా ఉంటారు.. ఒకటి రెండు సబ్జెక్టులు మినహా ఇతర సబ్జెక్టుల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తుంటారు. అయినప్పటికీ ఆ రెండు సబ్జెక్టుల లో ఫెయిల్ అవుతుంటారు. దీంతో కొన్ని సార్లు విద్యా సంవత్సరాన్ని కూడా నష్టపోతుంటారు. 



అయితే ఇకపై సీబీఎస్ఈ విద్యార్థులు ఈ విషయంలో దిగులు చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టారు. సీబీఎస్ఈ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో సహజంగానే చాలా మంది గణితం, సైన్సుల్లో ఫెయిలవుతున్నారు. కానీ వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, కంప్యూటర్స్ వంటి ఇతర సబ్జెక్టుల్లో స్కిల్స్‌ను ప్రదర్శిస్తున్నారు. ఈ రెండు సబ్జెక్ట్ లలో పెయిల్ అవుతుంటారు. విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినా, ఇతర ఏ సబ్జెక్టుల్లో అయినా ప్రతిభను చాటితే వారిని ఫెయిల్ కాకుండా పాస్ అయినట్లు గుర్తిస్తారు. 


సీబీఎస్ఈలో త్వరలో అమలు చేస్తున్న విధానం వల్ల విద్యార్థులకు మంచి జరుగుతుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.కొందరు విద్యార్థులు అనేక సబ్జెక్టుల్లో సత్తా చాటుతారని, కానీ గణితం, సైన్సుల్లో ఫెయిలవుతారని, అలాంటి వారికి ఈ కొత్త రూల్ ఎంతగానో ఉపయోగ పడుతుందని, దీంతో విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉంటారని ఉపాధ్యాయులు ఈ కొత్త రూల్‌కు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇలా చేయడం వల్ల విద్యార్థులకు ఒక ఏడాది ఆదా అవుతుందని అంటున్నారు. ఆ రెండు సబ్జెక్టుల్లో ఫెయిలై ఇతర సబ్జెక్టుల్లో ప్రతిభ చాటితే ఓకే. కానీ అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయితే మాత్రం ఏమీ చేయలేరు. మళ్లీ అవి చదవాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: