పసిడి కొనుగోలు చేసే వారికి ఊరట కలిగించే అంశం. పసిడి ధరలు నిలకడగానే ఉంటూ వస్తున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో 3 రోజులుగా ధరలు నిలకడగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. స్థిరంగానే ఉంది. ధరలు బుధవారం మార్పులు లేకుండా ఉంది. దీంతో గురువారం మార్కెట్లు స్థిరంగా ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కదలిక లేకుండా ఉన్నాయి. బంగారం ధరలు ఈరోజు  మార్పులు లేవు.


అంతర్జాతీయ మార్కెట్ లో ధరల మాట పక్కన పెడితే హైదరాబాద్ మార్కెట్ లో గురువారం ధరలలో ఎటువంటి మార్పులు లేవు.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిలకడగానే కొనసాగింది. దీంతో రేటు రూ.45,830 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.42,010 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇది నిజంగానే అదిరిపోయే గుడ్ న్యూస్ అని అందరూ అంటున్నారు. ఇక వెండి విషయానికొస్తే..బంగారం ధరలు స్థిరంగా ఉంటె.. వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి.


మంగళవారం ధరలు కాస్త పెరిగినప్పటికీ బుధవారం స్థిరంగా నిలిచాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ప్రారంభ కంటే కాస్త తగ్గింది. బుధవారం కేజీ వెండి ధర వంద రూపాయలు తగ్గింది. దీంతో 71 వేల రూపాయల స్థాయిలోనే వెండి ధరలు ఉన్నాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 71,600 రూపాయల వద్దకు నిలిచింది. విదేశీ మార్కెట్ లో ధరలను పరిశీలిస్తే..మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 1.38 శాతం పెరుగుదలతో 1751 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. ఔన్స్‌కు 2.26 శాతం పెరుగుదలతో 26.64 డాలర్లకు ఎగసింది...మరి శుక్రవారం అన్నా ధరల్లో మార్పులు కనిపిస్తాయేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: