ఉలవల్ని ఏ రూపంలో ఆహారంగా తీసుకున్నా ఆరోగ్యమేనని నిపుణులు సూచిస్తున్నారు. నవ ధాన్యాల్లో ఒకటి. ఉలవ గుగ్గిళ్ళు, ఉలవచారు తెలుగు వారికి అత్యంత ప్రియమైన వంటకాలు. ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. ఉలవల్లో ప్రోటీన్ ఎక్కువ. పెరిగే పిల్లలకు మంచి టానిక్.  అయితే మారిన ఆహారపు అలవాట్ల కారణంగా నేటితరంలో ఉలవలు.. ఇతరత్రా వాటి ప్రాముఖ్యత గురించి తెలిసిన వారు కొద్ది మందేనని చెప్పుకోవచ్చు. మరి ఉలవలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఓ లుక్కేసేయండి..!

 

 రంగుల్లో లభించే ఉలవలు ఆరోగ్యానికి ఎంతోమంచివి. మూత్రసంబంధిత సమస్యలను తగ్గించడంలో వీటికి సాటి మరేమీ లేవు. మూత్రశయంలో ఏర్పడిన రాళ్లను ఇవి కరిగిస్తాయి. ఉలవలు తింటే రవ్వంత కూడా కొవ్వు చేరదు. అందుకే అన్ని వయసుల వారూ నిశ్చింతగా వీటిని తినొచ్చు. వీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉలవలకు ఆకలిని పెంచే శక్తి ఉంది. అందుకే దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడి కోలుకొన్నవారు తరచూ ఉలవలను తీసుకొంటే త్వరగా జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.

 

ఉలవలలోని పిండిపదార్థాలు ఆరోగ్యానికి చురుకుదనాన్ని ఇస్తాయి. ఉలవలను నానబెట్టి తీసుకోవచ్చు. లేదా వేయించి తీసుకోవచ్చు. ఉడికించైనా తీసుకోవచ్చు. ఉలవలను ఉడికించి ఆ నీటిని తాగడం ద్వారా జలుబు తగ్గుతుంది. ఊబకాయానికి ఉలవలు మించిన ఔషధం లేనేలేదు. కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు పోసి నానబెట్టి కుక్కర్‌లో ఉడికించి, ఆ ఉలవకట్టుకు చిటికెడు ఉప్పు కలిపిఉదయం పరగడుపునే తీసుకుంటూ ఉంటే ఈజీగా లావుత‌గ్గుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: