వేడి వేడి రైస్‌లో ఆవ‌కాయ ప‌చ్చ‌డి వేసుకుని తింటే.. అప్పుడు వ‌చ్చే ఆనందం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలుగువారికి ఊరగాయలు, పచ్చళ్లు ఎంతో ఇష్టం. అస‌లు అవి లేకుండా భోజనం కూడా ఊహించలేరు అంటే అతిశ‌యోక్తి కాదేమో. అమ్మ.. ఆవకాయ ఎవరూ మరిచిపోలేరు అన్న‌ది వాస్త‌వం. తెలుగువారికి ఎన్ని కూరలున్నా ఘుమఘుమలాడే ఆవకాయ లేనిదే భోజనం చేసిన తృప్తి మిగలద‌ని కూడా అంటుంటారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు.. చాలామంది పచ్చళ్లు పెడుతుంటారు. వీటిని సంవత్సరం మొత్తం ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ప‌చ్చ‌ళ్లు తిన‌డం వ‌ల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చాలామందికి ఒక అపోహ ఉంటుంది. 

 

కానీ, పచ్చళ్లు తింటే ఆరోగ్యానికి చాలామంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  ఊరగాయల పోషక విలువల సంగతికి వస్తే.. నిల్వ పదార్థం కాబట్టి వీటిలో గుడ్‌ బ్యాక్టీరియా ఉంటుంది. అది జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. మామిడికాయల్లో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్‌ సి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అలాగే ఆవకాయలో ఉండే నువ్వుల నూనె, ఆవాలు కూడా ఆరోగ్యానికి ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఊరగాయ తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందట. 

 

అవును మీరు విన్న‌ది నిజ‌మే. ఇటీవ‌ల‌ పరిశోధనల్లో ఈ విషయం వెల్ల‌డైన‌ట్లుగా నిపుణులు తెలిపారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. ఊరగాయ తయారీల్లో నువ్వుల నూనె యూజ్ చేస్తారు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, ప్రోటీన్స్, విటమిన్ బి, ఖనిజాలు, పీచు, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే నిల్వ పచ్చళ్లలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కొలెస్టరాల్ అదుపులో ఉంటుంది. అంతే కాకుండా లైంగిక సమస్యలను దూరం చేసే ఎన్నో మంచి గుణాలు ఈ ప‌చ్చ‌ళ్లో ఉన్నాయని నిపుణులు స్ప‌ష్టం చేశారు. అలా అని ఓవ‌ర్‌గా మాత్రం తిన‌కూడ‌దు. లిమిట్‌గా తింటే ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. కాబ‌ట్టి, ఎలాంటి భ‌యాలు లేకుండా ప‌చ్చ‌ళ్లు లిమిట్‌గా తీసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: