ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. నిత్యం ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఈ పద్ధతులు పాటించండి...శృంగారం వల్ల మొత్తం శరీరం రిఫ్రెష్ అవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, నాచురల్ పెయిన్ రిలీవర్, హ్యాపి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, రిలేషన్ షిప్ ఇంప్రూవ్ అవుతుంది.. మన భాగస్వామితో శృంగారం చెయ్యటం వలన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా వుంటారు...చక్కగా ఆరోగ్యం గా ఉండే వారు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటారట. వారి స్కిల్స్ కి మెరుగు పెట్టుకుంటూ ఉంటారట. ఇందు వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా ఉండి, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. యోగా, మెడిటేషన్ వంటివి శరీరానికీ మనసుకీ కూడా మంచివి.

ఆధ్యాత్మికంగా కూడా వ్యక్తి ఎదుగుదలకి సహకరిస్తాయి, ఒత్తిడి తగ్గించి ప్రశాంతతని అందిస్తాయి. స్పష్టమైన ఆలోచనని పెంచుతాయి. ఏ పనినైనా మొదటి నుండి చివరి వరకూ శ్రద్ధాసక్తులు తగ్గకుండా చేయగలిగే శక్తినిస్తాయి. ప్రతి కూల దృక్పథాన్ని పూర్తిగా పోగొడతాయి.చిరు నవ్వుతో ఉండే వారు చెరగని ఆరోగ్యంతో ఉంటారని నిపుణులు చెబుతున్నారు. నవ్వు వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి ఒత్తిడి తగ్గుతుంది. నవ్వుతూ ఉండే వారికి సర్కిల్ కూడా పెద్దగానే ఉంటుంది. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి వీరిలో ఎవరూ సందేహించరు. మీకు నచ్చే పనులు చేయండి, నచ్చే మ్యూజిక్ వినండి, మీకు నచ్చే మీరు మెచ్చే ఏ పనైనా మీ చిరునవ్వు చెదరకుండా కాపాడుతుంది.నీరు ఎక్కువ తాగడం వల్ల ఎక్కువసార్లు బాత్రూమ్ కి వెళ్ళ వలసి వస్తుంది, అందువల్ల కిడ్నీలు కూడా హెల్ది గా ఉంటాయి, టాక్సిన్స్ అన్నీ బయటకి వెళ్ళిపోతాయి.

మీకు నిద్ర పట్టేయవచ్చు కాక, కానీ అది ప్రశాంతమైన నిద్ర మాత్రం కాదు. లైట్స్ ఆఫ్ చేసి, చప్పుళ్ళు వినిపించకుండా తలుపు వేసేసి, ఫోన్ బ్రైట్నెస్ తగ్గించేసి పడుకోండి. అలాగే, నిద్ర కి గంట ముందు ఏమీ తినడం కానీ, వర్కౌట్ కానీ చేయకండి. అలాగే, మీ బాడీనీ, మైండ్ నీ నిద్రకి ప్రిపేర్ చేయడం కూడా మంచి అలవాటే అంటారు నిపుణులు. బ్రష్ చేసుకోవడం, ఫోన్ పక్కన పెట్టేయడం, అలారం సెట్ చేసుకోవడం, మీకు నచ్చే పుస్తకంలో ఒకటి రెండు పేజీలు చదవడం వంటి అలవాట్ల వల్ల మీరు ఈ సైకిల్ లో మొదటి పని మొదలు పెట్టగానే మీ శరీరం, మనసు కూడా నిద్రకి తయారైపోతాయి. అప్పుడు చక్కని ప్రశాంతమైన నిద్ర పడుతుంది.ఎనిమిది గంటలు పక్కాగా నిద్రపోండి. ఖచ్చితంగా ఆరోగ్యంగా ఆనందంగా బ్రతుకుతారు.. ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి: