భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి.వీటిలో పాలకూర, గోంగూర, మెంతికూర, పుదీన, కొత్తిమీర, కరివేపాకు మొదలైనవి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాలకూర పోషకాహార నిధి అని, ఇందులో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ఏ,డీ,కే,సి విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, ఫైటో న్యూట్రియెంట్లు, ఐర‌న్‌, క్యాల్షియం, సోడియం, ఇత‌ర పోష‌కాలు అధికంగా ఉంటాయి. పాలకూరను ఇంగ్లీషులోspinach అంటారు. పిల్లలకు, పెద్దలకు అవసరమైన పోషకాలను, శక్తిని పెంపొందించి శరీర పెరుగుదలకు, దృఢత్వానికి పాలకూర చాలా ముఖ్యమైనది. అందువ‌ల్ల పాల‌కూర‌ను త‌ర‌చూ మీ ఆహారంలో  అధికంగా చేర్చుకోవడం వల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.పాలకూర వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందా...

ప్రతిరోజూ పాలకూరను తినడం వల్ల, మీ రోజువారీ పోషక అవసరాలను తీర్చటానికి సహాయపడుతుంది.పాల‌కూర‌లో ఐర‌న్ స‌మృద్ధిగా ఉండడంతో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేసి చ‌ర్మ క్యాన్స‌ర్ రాకుండా ఉంటుంది.

పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్,విట‌మిన్ కె నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపుతుంది. అందువ‌ల్ల మెద‌డు చురుగ్గా మారీ జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి.

పాల‌కూర‌లో ఉండే అధిక ఫైబర్  బరువును త‌గ్గించడంలో స‌హాయ ప‌డుతుంది.ఇంకా మ‌ల‌బ‌ద్ద‌కంను నివారించి జీర్ణ‌క్రియను మెరుగు పరిచేందుకు సహాయ పడుతుంది.

పాల‌కూర‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటాయి.అందువ‌ల్ల ఆస్టియోపోరోసిస్‌, మైగ్రేన్‌, ఆస్త‌మా, ఆర్థ‌రైటిస్, త‌ల‌నొప్పులు ఉన్న‌వారు పాల‌కూర‌ను ఆహారంలో భాగం చేసుకుంటే స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

పాల‌కూర‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. కావున హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు త‌ర‌చూ పాల‌కూర‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

శరీరానికి కావాల్సిన ఐరన్,కాల్షియం పాల‌కూర‌లో  పుష్క‌లంగా ఉంటుంది. అందువ‌ల్ల ఎముక‌ల్లో సాంద్ర‌త పెరిగి ఎముక‌లు ఆరోగ్యంగా, దృఢంగా మారుతాయి.

పాల‌కూర‌లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు ప‌రిచి దృష్టి లోపాలను నివారించవచ్చు
వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే కంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: