రోజు ఒక అరటి పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అరటి పండు తినడం వలన మనకి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఐరన్ లోపంతో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళు ప్రతి రోజు ఒక అరటి పండు తింటే ఐరన్ శాతం వృద్ధి చెందుతుంది.నీరసం కానీ అలసట గాని వచ్చినప్పుడు అరటి కాయ తింటే తక్షణ శక్తి వస్తుంది.అరటి పండ్లు కూడా మార్కెట్లో మనకు విరివిగా లభ్యం అవుతున్నాయి. ధర కూడా చాలా తక్కువగానే ఉంటాయి. అలాగే పెరుగు తింటే కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలుగుతుంది. పెరుగు తినడం వలన జీర్ణవ్యవస్థను బలంగా ఉంటుంది.  అలాగే పెరుగులో ఉండే బాక్టీరియా కడుపులో ఉన్న సమస్యలను తగ్గిస్తుంది.


అయితే మీ అందరికి తెలియని విషయం ఏంటంటే అరటిపండును పెరుగుతో పాటు కలిపి తింటే చాలా మంచిది. అది కూడా ఉదయం పూట తింటే ఆరోగ్యానికి మరి మంచిది. పెరుగులో కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.అలాగే  అరటిలో విటమిన్లు, ఐరన్, ఫైబర్ లభిస్తాయి.
ఉదయం పూట టిఫిన్ కింద  పెరుగు, అరటి పండు తీసుకోవడం వలన ఎముకలు బలంగా మారతాయి.  అంతేకాకుండా రెండు కలిపి తినడం వలన బరువు కూడా తగ్గుతారు. ఎలాగంటే  అరటి పండులో ఫైబర్  శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది.

అంతే కాకుండా ఇవి రెండు కలిపి తినడం వలన ఎక్కువగా ఆకలి వేయదు. అలాగే అరటిపండు అండ్ పెరుగు కలిపి తినడం వలన మలబద్దకం సమస్య తగ్గుతుంది. మరి మీరు కూడా ఒకసారి అరటిపండు అండ్ పెరుగు కాంబినేషన్ ట్రై చేసి చూడండి. మీరు ఒక విషయంలో మాత్రం చాలా శ్రద్ద వహించాలి అదేంటంటేఏ పని మొదలుపెట్టిన అది ఒకటి రెండు రోజులు చేసి ఆపేస్తే ఫలితం కనిపించదు. ఏ పని అయిన క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తేనే ఫలితం మంచిగా ఉంటుంది. !



మరింత సమాచారం తెలుసుకోండి: