ఇటీవలి కాలంలో మనుషుల ప్రాణాలకు అసలు గ్యారెంటీ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఏ క్షణంలో  ప్రాణాలు పోతాయో కూడా తెలియని విధంగా మారిపోయింది పరిస్థితి. దీంతో ఒకప్పుడు బాగా సంపాదించాలి విలాసవంతమైన జీవితాన్ని గడపాలి అని అనుకునేవారు. ఇప్పుడు మాత్రం హాయిగా సంతోషంగా బ్రతికితే చాలు అని అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఒక వైపు కరోనా వైరస్ దేశంలో ఎంతో మందికి సోకుతూ ప్రాణభయం కలిగిస్తూ ఉంటే.. మరి కొన్ని రకాల వైరస్ లు కూడా జనాలను బెంబేలెత్తిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలోనే  బర్డ్ ఫ్లూ తెర మీదికి వచ్చి అందరినీ భయపెట్టింది. ఇక ఇప్పుడు బర్డ్ ఫ్లూ తగ్గింది అనుకునేలోపు మంకీ పాక్స్ అంటు ఇప్పుడు కొత్త మహామారి అందరిని భయాందోళనకు గురి చేస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇక మంకీ ఫాక్స్ గురించి అందరికీ అవగాహన తెచ్చుకుంటున్న నేపథ్యంలో.. ఇక ఇప్పుడు మరో కొత్త పేరు తెరమీదికి వచ్చింది. ఇటీవలి ఒడిస్సా రాష్ట్రంలో టొమాటో ఫ్లూ కలకలం రేపింది. దీంతో అందరూ బెంబేలెత్తిపోతున్నారు అనే చెప్పాలి. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసిజ్  గా పిలిచే టొమాటో ఫ్లూ ఒడిషాలో విస్తరిస్తూ ఉండటం గమనార్హం. 36 మంది చిన్నారులు నమూనాలను పరీక్షించగా 26 మందికి ఈ వైరస్ సోకిన ట్లు అధికారులు గుర్తించారు. ఇది అంటువ్యాధి కావడం గమనార్హం. అయితే ఈ వ్యాధి ప్రాణాంతకం కాదని ఆందోళన చెందాల్సిన పని లేదు అంటూ వైద్యులు చెబుతు ఉన్నారు. మొదట్లో కేరళలోనూ 80 మంది చిన్నారుల్లో ఇక ఈ టొమాటో ఫ్లూ బయటపడటం గమనార్హం. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం రావడం నోట్లో పుండ్లు చేతులు కాళ్లు పిరుదుల పై దద్దుర్లు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయట..

మరింత సమాచారం తెలుసుకోండి: