ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిలా తయారైపోయింది.  చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు రకరకాల క్యాన్సర్లతో ఇబ్బంది పడుతున్నారు . మరికొందరు క్యాన్సర్ ని జయిస్తే కొందరు మాత్రం చిన్న వయసులో కూడా మరణిస్తున్నారు . కాగా ఈ మధ్యకాలంలో అబ్బాయిలలో ప్రొస్టేట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తున్నాం.  పురుషులలో ప్రోస్టేట్ గ్రంధిలో ప్రారంభమయ్యే ఒక సాధారణ క్యాన్సర్ ఇది. కానీ ఇది స్టేజ్ స్టేజ్ మారితే చాలా చాలా ప్రమాదం అంటున్నారు డాక్టర్లు.  ప్రొస్టేట్ అనేది మూత్రశయం క్రింద మరియు  పురుష నాళం ముందు ఒక చిన్న గ్రంధి .


అయితే ఈ గ్రంధిలోని కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభించి అదుపు లేకుండా మారినప్పుడు అది క్యాన్సర్ గా వస్తుంది అంటున్నారు డాక్టర్లు . నిజానికి క్యాన్సర్ చాలా నెమ్మదిగా పెరుగుతుంది . కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రం చాలా వేగంగా ఇది వ్యాపిస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు . ప్రారంభ దశలో లక్షణాలు కనుగొని ట్రీట్మెంట్ తీసుకుంటే దీనిని పూరి గాని పూర్తిగా నివారించవచ్చు అంటూ చెబుతున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్ యొక్క మూడు ఖచ్చితమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


 
ప్రొస్టేట్ క్యాన్సర్ యొక్క ప్రధాన లక్షణం ముహూర్త విసర్జన చేస్తున్న సమయంలో ఇబ్బందులు పడడం . ఇది చాలా మందిలో మొదట కనిపించే లక్షణం . మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో మూత్ర విసర్జన చేయడానికి టాయిలెట్ కు తరచుగా వెళుతూ ఉండడం.. మూత్ర విసర్జన విధానాలలో మార్పులు రావడం వంటివి కనిపిస్తాయట. ముఖ్యంగా 50 ఏళ్ల లోపు పురుషులకు ఈ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది అంటూ డాక్టర్లు చెపుతున్నారు. మూత్రంలో రక్తం కనిపించడం.. బరువు తగ్గడం మరియు అలసట..  అంగస్తంభన..  కటి ప్రాంతంలో నొప్పి ..ప్రొస్టేట్  గ్రంధి విస్తరించడం వల్ల మూత్రనాలంపై ఒత్తిడి ఎక్కువగా తెస్తుందట.  ఆ కారణంగానే ఈ ప్రైవేట్ పార్ట్ క్యాన్సర్ పెరుగుతుంది అంటున్నారు డాక్టర్లు.
మీకు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: