
అయితే మొదటిసారి ఈ టీని కేవలం పురుషులు రాజకీయ చర్చల సమయంలో మాత్రమే తాగేవారు.కానీ ఇప్పుడు ఇది ఒక కల్చర్ గా మారిపోయింది. కుటుంబాలు, స్నేహితుల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు బాటలు వేసినటువంటి వాటిలో ఇరానీ కేఫ్ దే ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. రుచికరమైన వంటకాలతో పాటుగా ఎంతో చరిత్ర కలిగిన అత్యంత ప్రజాదారణ పొందిన ఇరానీ కేఫ్ , ఛాయ్ టీలను అందిస్తోంది. ఇరానీ కేఫ్లను చూసుకొని ఛాయ్ మసాలా, ఛాయ్ లాట్టే, ఐస్డ్ ఛాయ్ ఇతర విభిన్నమైన రుచులతో కలిగిన టీలను తాగుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పెద్దపెద్ద నగరాలలో ఛాయ్ అనేది ఒక భారీ వ్యాపార పరిశ్రమగా మారిపోయింది. చాలామంది వ్యవస్థాపకులు సైతం తమ సొంత బ్రాండ్ టీ కేఫ్లను మొదలుపెట్టారు.అయితే చాయ్ రుచి కోసమే కాకుండా చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి కూడా తాగుతున్నారు. ఈ టీలోకి కొంచెం అల్లం, యాలకలు, మిరియాలు తదితర సుగంధ ద్రవ్యాలను కూడా వేసుకొని మరి తాగుతున్నారు. ఇరానీ చాయ్ కి ప్రసిద్ధ అనుబంధంతో కొన్ని ఉన్నాయి.
కేఫ్ నిలోఫర్: ఇది నగరంలోనే ఎంతో ప్రసిద్ధి కలిగిన టీ హౌస్.. ఇది రాయదుర్గంలో 40 వేల చదరపు అడుగులలో కలదు.
అలాగే చార్మినార్ సమీపంలో కూడా నిమ్రా కేఫ్ బేకరీ కలదు.
జూబ్లీహిల్స్ లో చాయ్ పానీ కేఫ్ కలదు.ఇక్కడ రకరకాల వెరైటీ చాయ్ లు దొరుకుతాయి.
బ్లూ సి: సికింద్రాబాద్లో ఇరానీ చాయ్ సెంటర్.
రోస్ట్ సీసీకే: బంజారా హిల్స్ లో ఈ కేఫ్ కలదు. అక్కడ పలు రకాల బేకరీ ఉత్పత్తులను కూడా అందిస్తోంది.
1935లో అబిడ్స్ లో ఏర్పాటు అయిన గ్రాండ్ హోటల్ లో హైదరాబాద్ చాయ్ లభిస్తుంది.
సోమాజిగూడలో రెడ్ రోజ్ రెస్టారెంట్ కూడా కలదు.