
చాలామంది దంపతులు శృంగారంలో పాల్గొనే ముందు బాడీ ఫర్ ఫ్యూమ్ కొట్టుకుంటారు. నిజానికి పర్ఫ్యూమ్ అనేది ఒకరికి నచ్చోచు ఇంకొకరి నచ్చకపోవచ్చు. నచ్చితే ఓకే కానీ నచ్చకపోతే మాత్రం శృంగారం చేదు అనుభవాన్నే మిగుల్చుతుంది. అందుకే బాడీ పర్ఫ్యూమ్, బట్టల సెంటు గట్రా శృంగారానికి ముందు ఉపయోగించకపోవడమే మేలు. గోరువెచ్చని నీటితో శుభ్రంగా స్నానం చేస్తే సరిపోతుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. శృంగారం చేసే ముందు చాలామంది హడావుడిగా ప్రవర్తిస్తూ ఆందోళన చెందుతూ ఉంటారు. ఫలితంగా శృంగార అనుభూతి పూర్తిస్థాయిలో దక్కదు. అందుకే శృంగారం చేసే ముందు అరగంట పాటు ధ్యానం చేయడం వలన మనసుకి కావాల్సినంత ప్రశాంతత దొరుకుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.
కొందరు శృంగారం చేసే ముందు కడుపునిండా భోజనం చేస్తారు. శృంగారానికి ముందు తినడం వలన పూర్తి అసంతృప్తే మిగులుతుందని సెక్సాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. శృంగారానికి ముందు మసాజ్ చేయించుకోవడం వలన శరీరం సెక్స్ చేసేందుకు సమాయత్తమవుతుందట. కొందరు శృంగారం చేసిన వెంటనే నిద్ర పోతారు. అలా చేయడం సరైన పద్ధతి కాదని సైకాలజిస్టులు చెబుతున్నారు. శృంగారంలో పాల్గొన్న తర్వాత కూడా కాసేపు శృంగారం గురించి మాట్లాడుకుని ఆ తర్వాత నిద్రపోతే మానసిక సంతృప్తి దొరుకుతుందట.
కొందరు దంపతులు చిన్నచిన్న గొడవలకు శృంగారంలో పాల్గొనకుండా చాలా రోజులపాటు ఒంటరిగానే నిద్రపోతుంటారు. ఇలా ఒంటరిగా ఉండటం వలన అసలుకే ఎసరు వస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. అలాగే శృంగారం చేసేటప్పుడు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవాలని... శృంగార సమయంలో పొగడటం వలన ఇరువురి ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరిగిపోతుందని.. ఫలితంగా దంపతులు ఇద్దరూ కూడా తమ శృంగార సమయాన్ని ఆస్వాదించే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నేరుగా శృంగారంలో పాల్గొంటే ఆడవారికి అస్సలు నచ్చదట. ఆడవారిని ఒక వస్తువు లాగా పరిగణించకుండా వారితో అన్ని విషయాలు చర్చిస్తూ క్రమక్రమంగా ముద్దులు పెట్టుకుంటూ ఆ తర్వాత శృంగారం చేస్తే ఆడవారు గొప్పగా ఫీల్ అవుతారట.