చలికాలంలో మీ మొక్కలను మీరు బాగా సంరక్షించుకోవాలి అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ ఇంట్లో పెంచే మొక్కలకు కొద్దిగా కాంతి తగిలేలా ఉండాలి. సూర్యరశ్మి తగిలినప్పుడు మొక్కలు చాలా వేగంలో పెరగడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా పెరుగుతాయి.అందుకే మొక్కలకు కావలసిన సూర్యరశ్మి తగిలేలా వెలుతురులో ఉంచాలి.
శుభ్రం చేయడం కూడా చాలా అవసరం.. ఆకులపై దుమ్ము పేరుకుపోవడం వల్ల నీటిని పీల్చుకునే ఆకు పై ఉండే రంధ్రాలు మూసుకుపోతాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఆకులను పూర్తిగా శుభ్రం చేయాలి.. విరిగిన లేదా ఏదైనా తెగులు ఉంటే వెంటనే తొలగించాలి.. ఇతర ఆకులకు , కాండానికి మొక్కలను బ్రష్ తో శుభ్రం చేస్తే శుభ్రంగా ఉంటాయి. ఇండోర్ మొక్కలు చల్లటి ఉష్ణోగ్రతలను బాగా ఇష్టపడతాయి . కాబట్టి ఇంటి పర్యావరణాన్ని తేమగా ఉండేలా చూసుకుంటే మీ ఇంటి మొక్కలు చాలా సంతోషంగా పెరుగుతాయి.
చాలావరకు శీతాకాలంలో మొక్కలను కిటికీల దగ్గర, తలుపుల దగ్గర చల్లని వాతావరణంలో ఉండే లాగా మొక్కలను పెంచవలసి ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి