ఆయుర్వేదంలో 'తులసి'ని మంచి దివ్యఔషధంగా పేర్కొనడం జరిగింది. ఇక హిందూ మత గ్రంధాలలో దీన్ని ఎంతో పవిత్రమైనదిగా పేర్కొన్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే..వివిధ చర్మ రుగ్మతలు, అంటువ్యాధులు ఇంకా అలాగే ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి తులసిని ఉపయోగిస్తారు. అయితే తులసిని అధికంగా తీసుకోవడం వల్ల సంతానలేమికి దారితీస్తుందని తాజాగా రుజువు చేసిన పరిశోధనలు చెబుతున్నారు.శతాబ్దాలుగా ఆయుర్వేద ఇంకా చైనీస్ ఔషధాలలో సాంప్రదాయ ఔషధంగా ఉపయోగించబడుతున్నప్పటికీ.. దీని అతి వినియోగం అనేది ఇతర సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు.తులసి జలుబు, ఫ్లూ వంటి వివిధ కాలానుగుణ వ్యాధులను నయం చేయడంలో అపారమైన ప్రయోజనాలను కలిగి ఉంది. అలాగే ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.ఇంకా చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.అలాగే కిడ్నీ సమస్యలను కూడా నయం చేస్తుంది.పాము కాటు సమయంలో తులసిని ఆ చికిత్సలో వినియోగిస్తారు.జీర్ణ సమస్యలకు కూడా చికిత్స చేస్తుంది.అలాగే శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తుంది.


తులసి వలన నష్టాలు కూడా వున్నాయి.గర్భధారణ సమయంలో తులసిని ఎక్కువగా తింటే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. తులసి ఆకులను ఎక్కువగా తినడం అనేది గర్భిణీ స్త్రీల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది గర్భస్రావంకి కూడా దారితీస్తుంది.అలాగే హెర్బ్ గర్భాశయం, కటి ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడం ద్వారా తీవ్రమైన గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది.ఇంకా బ్లడ్ షుగర్ అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది సంతానోత్పత్తిని ప్రభావితం చేయవచ్చు. కొన్ని అధ్యనాల్లో తులసి సంతానోత్పత్తిపై ప్రభావితం కూడా చూపుతుందని తేలింది. ఇది స్పెర్మ్ కౌంట్‌ను కూడా తగ్గిస్తుందని తేల్చారు.అలాగే దంత క్షయం సమస్య పెరుగుతుంది.ఇంకా కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది.తులసి ఎక్కువగా వినియోగించడం వలన ఈ నష్టాలు వున్నాయి కాబట్టి తక్కువగా వినియోగించడం మంచిది. లేదంటే అనేక సమస్యల భారిన పడే ప్రమాదం ఎక్కువగా వుంది. కాబట్టి జాగ్రత్తగా వుండండి. ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: