
తెలుగు క్యాలెండర్ ప్రకారం మృగశిర కార్తెను వర్షాకాలనికి ప్రారంభానికి సంకేతంగా భావిస్తారు . ఈ సందర్భంగా చేపలు తినే సంప్రదాయం ఎప్పటినుంచో వస్తుంది . దాని వెనక ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి . వాతావరణ మార్పులు శాఖాహారులకు ప్రత్యామ్నాయాలు ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి . వైశాఖమాసం చివరలో రోహిణి కార్తె ఎండలు దంచి కొడతాయి . ఈ సమయంలో రోకల్లు కూడా పగిలిపోతాయి అనే ఒక సామెత కూడా ఉంది. అయితే దీని తర్వాత వచ్చే మృగశిర కార్తె వాతావరణాన్ని చల్లబరుస్తుంది . నైరుతీ రుతుపవనాలుకు నాంది పలుకుతుంది. మరీ ముఖ్యంగా వేసవికాలంలో ఉన్న తాపం మొత్తం తీరిపోయేలా ఉపశమనం లభించేలా ఈ సమయంలో రైతులు సామాన్య ప్రజలు ఎంతో సంతోషపడేలా వర్షాలు కురుస్తాయి .
అయితే మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినడం అనేది చాలా చాలా ఏళ్లుగా ఒక సాంప్రదాయంలా వస్తుంది . దీని వెనక శాస్త్రీయ కారణాలు కూడా చాలానే ఉన్నాయి . వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం కారణంగా శరీరంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది . ఇన్ని రోజులు ఎండలకి అల్లాడిపోయిన జనాలకి వర్షాలు పడటం కారణంగా సీజనల్ డీసీజెస్ వస్తాయ్. రోగనిరోధక శక్తి తక్కువై జ్వరం దగ్గు లాంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాపలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా లభిస్తాయి అనేది ఒక నమ్మకం .
అయితే కేవలం చేపలు మాత్రమే తినాలా..? అంటే లేదు చేపలు తినని వాళ్ళు శాకాహారుల కోసం వేరేవి కూడా ఉన్నాయి . మృగశిర కార్తె రోజున ఇంగువను బెల్లంతో కలిపి ఉండలుగా చేసి తినడం ఒక ఆచారం . శరీరానికి ఉష్ణోగ్రతలు అందించే పేగుల ఆరోగ్యానికి ఇది కాపాడుతుంది . అంతేకాదు చింతచిగురు పప్పులో ఇంగువ వేసి తినడం ద్వారా చేపలతో సమానమైన ప్రయోజనం పొందవచ్చు అని చెబుతున్నారు పెద్దలు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన పెద్దలు రూపొందించిన సాంప్రదాయాలు ఏవి కూడా మూఢనమ్మకాలు కాదు. మూఢనమ్మకాలపై ఆధారపడినవే కావు . మానవ శరీరాన్ని కాలచక్రాన్ని బట్టి ఏర్పడిన ఈ ఆచారాలకు శాస్త్రీయ నేపథ్యం కూడా ఉంది అనే విషయం గుర్తుంచుకోవాలి. ఫైనల్ గా మృగశిర కార్తె అంటే కేవలం ఒక తిధి మాత్రమే కాదు ..ఆరోగ్యకరమైన జీవనశైలికి నూతన ఆరంభమని కూడా చెప్పాలి . వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆహారాలవాట్లు మార్చుకోవడం ద్వారా శరీరానికి తగిన ఎనర్జీ వస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగే ఆహారాలను తీసుకోవడం మరింత ముఖ్యం.
నోట్ : ఇక్కడ తెలిపిన విషయాలు కేవలం ఒక సమాచారం మాత్రమే . ఆరోగ్యానికి సంబంధించి మీరు ఏదైనా సూచనలు సలహాలు పాటించే ముందు మీకు దగ్గరగా ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం చాలా చాలా ఉత్తమమ అని గుర్తుంచుకోండి..!!