
సాధారణ నీటి కంటే ఉప్పు నీరు శరీరంలో మరింత వేగంగా శోషించుకుంటుంది. ఇది ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేసి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. వ్యాయామం చేసిన తర్వాత లేదా వేడి వాతావరణంలో ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఉప్పు నీరు తాగడం వల్ల లాలాజలం, జీర్ణ ఎంజైమ్‌లు బాగా ఉత్పత్తి అవుతాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే, మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు ఉప్పు నీరు తాగితే ప్రేగుల కదలికలు మెరుగవుతాయి.
ఉప్పులోని ఖనిజాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. చర్మంపై ఉండే మలినాలను, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. ఇది మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించి, చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. సాల్ట్ వాటర్‌లో ఉండే మెగ్నీషియం నాడీ వ్యవస్థను ప్రశాంతం చేస్తుంది. ఇది ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి, మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు పడుకునే ముందు కొద్దిగా ఉప్పు నీరు తాగితే ప్రయోజనం ఉంటుంది.
సాల్ట్ వాటర్‌లో ఉండే ఖనిజాలు, ముఖ్యంగా సోడియం, శరీరం శక్తివంతంగా ఉండటానికి దోహదపడతాయి. ఇది అలసటను తగ్గించి, రోజు మొత్తం ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఈ ప్రయోజనాలు పొందడానికి, ఎక్కువ ఉప్పు వాడకుండా ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగడం ఉత్తమం. ఆరోగ్య నిపుణుల సలహా మేరకు మాత్రమే ఉప్పు నీటిని తీసుకోవాలి. ప్రతి ఒక్కరి శరీర తత్వం వేరుగా ఉంటుంది కాబట్టి, ఇది అందరికీ ఒకే విధంగా పని చేయకపోవచ్చు.