‘శివ’తో తెలుగు సినిమా మాత్రమే కాదు.. ఇండియన్ సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్ నే మార్చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన సంచలన సినిమాలు తీశారు అనేకంటే ఆయనో ‘ట్రెండ్ సెట్టర్’ అనడం కరెక్ట్ మాట. అలా బాలీవుడ్ లో సృష్టించిన ట్రెండ్ సెట్టింగ్ మూవీ ‘సత్య’. ఈ సినిమాతో బాలీవుడ్ లో కనీసం పేరెత్తడానికే భయపడే ‘అండర్ వరల్డ్ మాఫియా’ను సినిమాగా తీసి సంచలనం రేపాడు. విస్తుపోవడం బాలీవుడ్ వంతైతే.. ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్ చేయడం ప్రేక్షకుల వంతైంది. ఆ సినిమా విడుదలై నేటికి 22 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

సినిమా 1998 జూలై 3న విడుదలైంది. అప్పటికే బాలీవుడ్ లో శివ, రంగీలాతో మోగిపోతున్న వర్మ పేరు ‘సత్య’తో దేశం మొత్తం మోగిపోయింది. ముంబయిలో మాఫియా సామ్రాజ్యం ఏస్థాయిలో ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు. ముఖ్యంగా సినీ సామ్రాజ్యాన్ని ఎలా గుప్పెట్లో పెట్టుకుంటారో కూడా చూపించాడు. సత్యకు ముందు తర్వాత కూడా మాఫియాను వర్మ స్థాయిలో చూపినట్టు మరో దర్శకుడు చేయలేకపోయాడు. సినిమాలో మాఫియా పాత్రధారులు కనపడరు.. నిజమైన మాఫియానే కనపడుతుంది. అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీశాడు. సినిమాలో ట్రాజిక్ ఎండింగే ప్లస్ పాయింట్ అయింది.

IHG'Satya'

 

ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో ‘సత్య చూస్తే నాకు ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది’ అని వర్మ అన్నాడంటే సినిమా కంటెంట్ ఎలాంటిదో అర్ధమవుతుంది. ఎంతో స్టడీ చేయడం, డేరింగ్, గట్స్.. ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు తీయలేరు. తెలుగు వ్యక్తి జేడీ చక్రవర్తిని హీరోగా తీసుకుని  ప్రేక్షకుల్లో అంచనాలు పెంచకుండా ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఊర్మిళ హీరోయిన్ గా నటించింది. మనోజ్ బాజ్ పాయ్ సినిమాకు ఓ ఎస్సెట్. రియల్ బాలీవుడ్ ని, మాఫియాను చూపించిన ‘సత్య’ ఎప్పటికీ ఓ క్లాసిక్.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: