దిల్ రాజ్ అసలు పేరు వి. వెంకట రమణారెడ్డి అయితే ‘దిల్’ సూపర్ సక్సస్ తరువాత అతడు దిల్ రాజ్ గా మారిపోయాడు. డిస్ట్రిబ్యూటర్ నిర్మాత ఎగ్జిబిటర్ ఇలా సినిమా రంగానికి సంబంధించిన అనేకరంగాలలో దిల్ రాజ్ కు మంచిపట్టు ఉంది. 90 శాతం వరకు దిల్ రాజ్ ఒక కథ విన్న తరువాత చెప్పే అంచనాలు నిజం అవుతూ ఉంటాయి.

ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఆ నలుగురులో ఒకరు గా ఇండస్ట్రీని శాసిస్తున్న దిల్ రాజ్ పేరును బాలీవుడ్ మీడియా ‘రీమేక్ రాజ్’ గా మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం వరసపెట్టి అతడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సినిమాలు అని అంటున్నారు. తెలుగులో నాని నటించిన ‘జెర్సీ’ మూవీని  హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తీస్తున్నాడు. తెలుగు వెర్షన్ ను డైరక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.


ఈ సినిమాతో పాటు మరో హిట్ సినిమాను దిల్ రాజ్ రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చేయబోతున్నాడు. రాజ్ కుమార్ రావు హీరోగా అదే టైటిల్ తో శైలేష్ కొలను దర్శకత్వంలోనే ఈ సినిమా రాబోతోంది. ఈ రెండు సినిమాలకు అదనంగా మరో రీమేక్ ను దిల్ రాజ్ తీయబోతున్నట్లు తెలుస్తోంది.


బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తో కలిసి ‘నాంది’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి దిల్ రాజ్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అల్లరినరేష్ చేసిన హీరో పాత్రను హిందీలో ఎవరు చేస్తారు అన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవైపు తెలుగులో హిందీలో వరసపెట్టి సినిమాలు చేస్తున్న దిల్ రాజ్ దృష్టి ఇప్పుడు కోలీవుడ్ పై పడటంతో పాటు టాప్ హీరో విజయ్ వంశీ పైడిపల్లి ల కాంబినేషన్ లో త్వరలో దిల్ రాజ్ మొదలుపెట్టబోతున్న మూవీ ప్రారంభం అయితే దిల్ రాజ్ ఖ్యాతి నిర్మాతగా దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయే అవకాశం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: