మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడు చిత్రం 1992లో విడుదలై సృష్టించిన ఇండస్ట్రీ రికార్డులు అన్నీ ఇన్ని కావు. కె రాఘవేంద్రరావు డైరెక్టర్ గా నిర్మించిన ఈ సినిమా రికార్డుల వర్షంతో పాటు కాసుల వర్షం కూడా కురసింది. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిరంజీవి స్వతహాగా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా ఎదిగి ఈ సినిమాతో దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోగా అవతరించారు. అప్పటివరకు అమితాబ్ ఈ లిస్ట్ లో మొదటి ప్లేస్ లో ఉండగా అప్పటి నుంచి చిరంజీవి అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో గ మారాడు.

సినిమా మలయాళంలో కూడా విడుదల కాగా అంతకుముందు తెలుగు నుంచి విశ్వనాథ్ తెరకెక్కించిన శంకరాభరణం త్రివేండ్రం లో ఒక థియేటర్ లో ఏడాదిపాటు ఆది రికార్డ్ సృష్టించింది. ఆ సినిమాను సంభాషణల వరకు మలయాళంలోనూ డబ్ చేసి తెలుగు పాటలతో రిలీజ్ చేశారు. మన్నన్ అనే పేరుతో రజినీకాంత్ ఈ సినిమాను మలయాళం లో రీమేక్ చేయగా కేరళలో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది ఈ సినిమా.  మొదటగా ఘరానా మొగుడు సినిమా నీ ఎవరూ రీమేక్ చేయాలని అనుకోలేదు.  

కానీ ఘరానా మొగుడు లో చిరంజీవి ప్రదర్శించిన అభినయం చేసిన డ్యాన్సులు కేరళలోని పేరు పొందిన నిర్మాణ పంపిణీ సంస్థ సెవెన్ ఆర్ట్స్ అధినేత లు విజయ్ కుమార్ జయ్ కుమార్  లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను మలయాళంలోకి డబ్ చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే మలయాళ హక్కులు కొనుగోలు చేశారు. హే హీరో అనే టైటిల్ పెట్టారు. పబ్లిసిటీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని పేరుపొందిన కోటగిరి వెంకటేశ్వరరావు తో ట్రైలర్ కట్ చేయించారు.  1994లో 12 విడుదలైన ఈ సినిమా 50 రోజులు పూర్తయ్యే సరికి 21 రోజులకు చేరుకుంది.  ఆ తర్వాత ఈ సినిమా కోటి రూపాయలు కలెక్ట్ చేసిన తొలి తెలుగు డబ్బింగ్ ఫిల్మ్ గా కొత్త చరిత్రను సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: