సినిమా నటులు కమర్షియల్ యాడ్స్ లో నటించడం ద్వారా చాలా డబ్బు సంపాదిస్తారు. సంవత్సరాల తరబడి సినిమాలలో నటించే దానికంటే రోజుల వ్యవధిలో ఒక కమర్షియల్ యాడ్ చేస్తే వచ్చే సంపాదన చాలా ఎక్కువ. పలు కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి సినిమాలలో స్టార్ స్టేటస్ పొందిన తారలను తమ పెట్టుకొని బ్రాండ్ ను బ్రాండ్ వాల్యూ పెంచుకుంటారు. టాలీవుడ్ స్టార్ హీరోలైనా మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు వరుసగా యాడ్స్ లో నటించి కోట్లు సంపాదిస్తున్నారు.

వీరేకాక గతంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలు సైతం యాడ్స్ లో నటించిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది మాత్రం యాడ్స్ లో నటించడానికి పెద్దగా ఇష్టపడలేదు. వారెవరో ఇప్పుడు చూద్దాం. నందమూరి బాలకృష్ణ తన కెరీర్ మొదటి నుంచి ఇప్పటి వరకు కమర్షియల్ యాడ్స్ లో నటించడానికి అసలే ఇష్టపడలేదు. పలు కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్ ను ప్రమోట్ చేయాలని ఆయనను సంప్రదించినా కూడా ఆయన వాణిజ్యపరమైన ఎటువంటి యాడ్స్ లో నటించడం ఇష్టం లేదని చెప్పేశాడు.

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా ఇంతవరకు ఒక్క యాడ్ లో కూడా నటించలేదు. కారణం ఏంటో తెలీదు గానీ ఆయన యాడ్స్ లో నటించడానికి విముఖత చూపారు. నందమూరి ఫ్యామిలీ కి చెందిన కళ్యాణ్ రామ్ కూడా యాడ్స్ లో నటించే అవకాశం వచ్చినా దాన్ని తిరస్కరించాడు. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఉన్న గౌతమి కూడా యాడ్స్ అంటే దూరంగా ఉంది అలాగే సాయిపల్లవి, మంచు విష్ణు, మంచు మనోజ్, అనుష్క, అల్లరి నరేష్, సాయి ధరమ్ తేజ వంటి వారు కూడా కమర్షియల్ యాడ్ అంటే ఆమడ దూరం పరిగెత్తే వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: