బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ ఈ హీరో తాను నటించిన బాలీవుడ్ మూవీ ల ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను సంపాదించు కున్నాడు. అలాగే షారుక్ ఖాన్ భారత దేశం తో పాటు ఇతర దేశాలలో కూడా అనేక మంది అభిమానులను సంపాదించు కున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా షారుఖ్ ఖాన్ 'జవాన్' అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడి గా పేరును తెచ్చుకున్న అట్లీ దర్శకత్వం వహిస్తూ ఉండగా , నయన తార ,  ప్రియమణి ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించ బోతున్నారు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి అదిరిపోయే డిజిటల్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.

మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ లలో ఒకటి అయినటు వంటి నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ దాదాపు 250 కోట్లు వెచ్చించి ఈ మూవీ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ రేంజ్ లో డిజిటల్ రేట్ అంటే అది మామూలు విషయం కాదు అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి షారుక్ ఖాన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా ,  ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: