తెలుగు సినిమా ఇండస్ట్రీ లో జాతి రత్నాలు మూ వీతో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అనుదీప్ కె వి తాజాగా ప్రిన్స్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన శివ కార్తికేయన్ హీరోగా నటించాడు. ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కించారు. అక్టోబర్ 21 వ తేదీన ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ  విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మరియు రెండు పాటలను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ,  పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ కు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది. తాజాగా ప్రిన్స్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "హూ అమ్ ఐ" అనే సాంగ్ ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో శివ కార్తికేయన్ తో పాటు పలువురు ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తెలుగు మరియు తమిళ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: