టాలీవుడ్ సినిమా పరిశ్రమలో విభిన్నమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాడు హీరో సందీప్ కిషన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేసుకుంటూ పోతూ తన సినిమాలో ఎంటర్టైమెంట్ ఉందా లేదా అని మాత్రమే చూసుకుంటూ సినిమాలు చేసే సందీప్ కిషన్ ప్రస్తుతం ఒక పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతూ ఉండడం విశేషం. తాజాగా ఈ మైఖేల్ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలయ్యే చిత్రంపై అంచనాలను భారీ స్థాయిలో పెంచింది.

సినిమా కంటే ముందుగా సందీప్ కిషన్ కొన్ని సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసిన కూడా అవి ఆయనకు ఏమాత్రం కలిసి రాలేదని చెప్పాలి. దాంతో ఈసారి చేయబోయే సినిమా తప్పకుండా భారీ విజయం అందుకునే సినిమా అయి ఉండాలని భావించి ఇప్పుడు ఈ సినిమాను భారీ స్థాయిలో చేస్తున్నాడు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలలో సైతం ఈ సినిమా విడుదల అవడం జరుగుతూ ఉండడం ఈ హీరోకి అక్కడ ఎంత స్థాయిలో గుర్తింపు ఉందో చెప్పవచ్చు. 

మొదటి నుంచి కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాదు ఇతర భాషల సినిమాలలో కూడా నటిస్తూ వచ్చి అక్కడి ప్రేక్షకులకు సుపరిచయం అయ్యాడు. ఆయన కెరియర్ కు ఎప్పుడు అదే ప్లస్ అయింది అని చెప్పాలి. కొన్ని తమిళ సినిమాలు ద్వారా అక్కడి ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఏర్పరచుకునే మార్కెట్ దక్కించుకున్న సందీప్ కిషన్ ఇప్పుడు అలా వచ్చిన మార్కెట్తోనే ఈ మైకేల్ సినిమాను విడుదల చేస్తూ ఉండడం విశేషం. ఏదేమైనా ఈ సినిమా యొక్క టీజర్ భారీ స్థాయి లో ప్రేక్షకులను అలరించడం విశేశం. దాదాపుగా ఈ సినిమా యొక్క చిత్రీకరణ పూర్తి చేసుకోగా ఈ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: