గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లకు మరియు ఎన్నో వైవిద్యమైన మూవీ లకు దర్శకత్వం వహించి , ఇండియా వ్యాప్తంగా దర్శకుడి గా తనకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా తన సినిమాలతో ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష ముఖ్యమైన పాత్రలలో నటించగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తమిళ్ తో పాటు తెలుగు ,  కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేసి , డీసెంట్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అని ,  ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది అని ,  నవంబర్ 18  వ తేదీ నుండి ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తమ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతోంది అని , అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో రాబోతుంది అని ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: