రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కవలసిన కొత్త సినిమా పట్ల అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది.  రేపు మాపో ఆయన తదుపరి సినిమా మొదలు కాబోతుంది అని చెబుతున్న నేపథ్యంలో ఇంకా ఆ సినిమా అనౌన్స్మెంట్ ఇవ్వకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశను కలిగిస్తుంది. ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొంటున్న విజయ్ దేవరకొండ త్వరలోనే దాన్ని పూర్తి చేయనున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేవరకొండ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆయన కొత్త సంవత్సరంలోనే తన కొత్త సినిమాను మొదలు పెట్టబోతున్నాడని తెలుస్తుంది. ఈ ఏడాది లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలదించిన నేపథ్యంలో ఖుషి చిత్రాన్ని పూర్తిచేసి ఆ తర్వాత వచ్చే ఏడాది కొత్త సినిమాను చేయాలని భావిస్తున్నాడు.

దాదాపుగా గౌతమ్ తిన్ననూరి మరియు హరీష్ శంకర్ దర్శకత్వంలోని సినిమాలను ఆయన చేయబోతున్నాడని తెలుస్తుంది. ఒక క్లాస్ ఒక మాస్ దర్శకుడు తో కలిసి సినిమాలు చేస్తున్న ఆయన ఈ రెండు చిత్రాలను ఒకేసారి చేసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడు. ఇది మాత్రమే కాకుండా ఒక బాలీవుడ్ సినిమాను కూడా చేసే విధంగా విజయ్ దేవరకొండ ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలోనే దానికి సంబంధించిన ప్రకటన రాబోతుంది. ఇటీవలే ఓ బాలీవుడ్ దర్శకుడు చెప్పిన కథకు మెచ్చిన విజయ్ దేవరకొండ దాన్ని పూర్తిస్థాయిలో రెడీ చేయమని చెప్పాడట. ఒకవేళ ఆ కథ ఓకే అయితే కనుక బాలీవుడ్ లో కూడా ఆయన ఒక సినిమా చేయడం జరుగుతుంది.ఏదేమైనా వరుసగా రెండు భారీ డిజాస్టర్ లు పడ్డా కూడా విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి పెద్ద దర్శకులు లైన్ లో ఉండడం విశేషం. ఈ అవకాశంతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టాలిందే

మరింత సమాచారం తెలుసుకోండి: