గతేడాది దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఒక్క సినిమాతోనే దేశ విదేశాల్లోనూ మంచి క్రేజ్ ను దక్కించుకున్నాడు. ఇలానే కంటిన్యూ చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరితో మరియు మరో దర్శకుడు బుచ్చిబాబుతో కూడా పాన్ ఇండియా సినిమాలలో నటించేందుకు రెడీగా ఉన్నాడు. 

ఇక శంకర్ మరియు రామ్ చరణ్ దర్శకత్వంలో రానున్న సినిమా 2023 సమ్మర్లో రిలీజ్ చేయనున్నారు. బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అని ప్లాన్ తో ఉన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న సినిమాల లిస్టులో మరో సినిమా కూడా చేరింది. ఇక హిందీ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టితో ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట రామ్ చరణ్. దీనికిగాను చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ హిందీ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాల్లో ఎక్కువ శాతం ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఉంటాయి.

ఇక ఆయన తెరకెక్కించిన సినిమాల్లో చాలావరకు సూపర్ హిట్ సినిమాలే. కాబట్టి ఈయనతో సినిమా చేయడానికి తెలుగు హీరోలు సైతం ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ హిందీ డైరెక్టర్ ఎలాంటి సినిమాలు తెరకెక్కించిన ఆ సినిమాలో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ ఉంటాయి. ఇక అలాంటి రోహిత్ శెట్టితో రామ్ చరణ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఇందులో భాగంగానే రామ్ చరణ్ కూడా ఈ దర్శకుడు తో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. 2024 నుండి రోహిత్ శెట్టితో సినిమా మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడట రామ్ చరణ్. ఇక అదే సంవత్సరం దసరాకి ఆ సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: