
సత్యరాజ్ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే సత్యరాజ్ రాజకీయాల పైన తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేశారు. నటీనటులను తలపై పెట్టుకుని ఊరేగడం మానేయండి.. వాళ్లకు అన్ని విషయాలు తెలుసు అనుకోకండి! నటించడం మాత్రమే వాళ్లకి తెలుసు? ఈ సమాజంలో జరుగుతున్న ఎలాంటి తప్పులు తెలియవు.. వారి అభిమానులు నటులను ఐన్ స్టిన్ రేంజ్ లో ఊహించుకోవడమే మీరు చేస్తున్న తప్పు అంటూ తెలియజేశారు. వాళ్లేమి వారేమీ పెరియార్, అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తులు కాదని ,కేవలం దర్శకులు చెప్పినవే వారు అనుసరిస్తారు అంటు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు.
అయితే ఈ పోస్ట్ ఇన్ డైరెక్ట్ గా ఒక హీరోని టార్గెట్ చేస్తూ ఇలా చేసినట్లుగా కొంతమంది ఫైర్ అవుతున్నారు. నటుడు సత్యరాజ్ చేసిన ఈ కామెంట్స్ పైన ప్రముఖ డైరెక్టర్ పేరరసు స్పందించారు. ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఈ డైరెక్టర్.. ఎంజీఆర్ ఉన్నప్పుడు ఇలానే ధైర్యం మీకు ఉండేదా? పార్టీ కోసం శ్రమించిన వారిని పక్కన పెట్టి సత్యరాజ్ కూతురుకి పదవి ఎందుకు ఇచ్చారంటూ తీవ్రంగా స్పందించారు డైరెక్టర్ పేరరసు. నటన అనేది వృత్తి మాత్రమే వారిలో ప్రపంచ జ్ఞానం కలిగిన వారు కూడా చాలామంది ఉన్నారంటూ తెలియజేశారు.