మెగాస్టార్ చిరంజీవి తాజాగా మైత్రి మూవీ సంస్థ నిర్మించిన వాల్తేరు వీరయ్య అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు  దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ మూవీ లో బాబి సింహ , ప్రకాష్ రాజు విలన్ పాత్రలో నటించగా , మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

రవితేజ కు భార్య పాత్రలో ఈ మూవీ లో కేథరిన్ నటించగా , బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఈ సినిమాలో బాస్ పార్టీ అనే స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుక జనవరి 13 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ రావడంతో ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ లాభాలు కూడా వచ్చాయి. 

ఇలా ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ యూనిట్ వీరయ్య విజయ విహారం అనే పేరుతో సక్సెస్ మీట్ ను నిర్వహించబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. జనవరి 28 వ తేదీన యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ... సుబేదారి ... హనుమకొండ లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: