
ఈ రోజున ఆయుధ పూజ, వాహన పూజలు చేసుకుంటే శుభం కలుగుతుందని నమ్ముతారు. వృత్తిపరంగా ఉపయోగించే పనిముట్లను, వాహనాలను శుభ్రం చేసి పూజించడం ఆచారం. దసరా నాడు దానాలు చేయడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. పేదవారికి లేదా అవసరమైన వారికి ఆహారం, డబ్బు, కొత్త దుస్తులు దానం చేయడం వల్ల పేదరికం తొలగిపోయి శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం.
కుటుంబ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, ఇతరులతో వాగ్వాదానికి దిగకుండా దైవనామస్మరణతో ప్రశాంతంగా గడపడం మంచిది. ఈ పండుగ రోజున బంధుమిత్రులకు శమీ పత్రిని పంచి, పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడం, ఆశీర్వదించుకోవడం ముఖ్యమైన సంప్రదాయం. దసరా రోజున మాంసం, మద్యం, ఉల్లిపాయ-వెల్లుల్లి వంటి తామసిక ఆహారాన్ని తినడం పూర్తిగా నివారించాలి. సాత్విక ఆహారం తీసుకోవడం శుభకరం.
శుభ సమయం చూసుకోకుండా ముఖ్యమైన లేదా కొత్త పనులను ప్రారంభించకూడదు. పండుగ రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ఇతరులను దూషించడం లేదా అవమానించడం మంచిది కాదు. ముఖ్యంగా వృద్ధులను, స్త్రీలను, పేదలను నిందించకూడదు. పగటిపూట నిద్రపోవడం లేదా సోమరితనంగా ఉండటం మానుకోవాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు