
ఇక ఆ తర్వాత మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇక ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. అయితే ఈ సినిమా సమయంలోనే నటుడు సిద్ధార్థతో అదితికి ఏర్పడిన పరిచయం కాస్త చివరికి ప్రేమగా మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారంటు ప్రచారం జరుగుతుంది. ఇటీవల శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో ఇద్దరు జంటగా కనిపించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే అదితి రావు హైదరికి గతంలోనే పెళ్లయింది. 2009లో సత్యదీప్ మిశ్రాన్ని పెళ్లి చేసుకుంది. కానీ 2013 లోనే విడాకులు ఇచ్చేసింది.
విడాకుల తర్వాత ఒంటరిగానే ఉన్న సత్యదీప్ ఇక ఇటీవల రెండో వివాహం చేసుకున్నారు. నేనా గుప్తా, వివియన్ రిచార్డ్స్ కుమార్తె మసబ గుప్తతో అతనికి పెళ్లి జరిగింది. అయితే ఇటీవల మాజీ భార్య అదితి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు సత్యదీప్ . అదితి రావు హైదరీతో.. నా రిలేషన్షిప్ కారణంగా.. నాకు ప్రేమ అనే పదం మీద విరక్తి కలిగింది. మరోసారి ప్రేమలో పడటం అనే ఆలోచన వస్తేనే భయం కలిగింది. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్ళు మళ్ళీ రిలేషన్షిప్ ప్రేమ అంటూ తిరగదు. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే కోల్పోయింది తిరిగి పొందగలం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇలా అదితి రావు హైదరీతో రిలేషన్ తనకు ఒక నరకం లాంటిది అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు సత్యదీప్ మిశ్రా.