టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా రావణాసుర. ధమాక వంటి సూపర్ హిట్‌ తర్వాత రవితేజ నుంచి వస్తోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి.అందుకు తగ్గట్లుగా ఈ సినిమాని మేకర్స్‌ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనూ ఎమ్మాన్యుయేల్‌, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్‌, ఫరియా అబ్దుల్లా ఇంకా అలాగే మేఘా ఆకాశ్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్స్‌ లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే మూవీ యూనిట్ తాజాగా నుంచి అప్‌డేట్‌ను ఇచ్చింది.రావణాసుర లోని ఫస్ట్‌ సాంగ్ ని విడుదల చేసింది. రావణాసుర థీమ్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. దశకంఠ లంకాపతి రావణా.. అంటూ సాగే ఈ పాట అభిమానులకు గూజ్‌బంప్స్‌ తెప్పిస్తోంది. ఈ సాంగ్ ని హర్షవర్దన్ రామేశ్వర్‌- భీమ్స్‌ సిసిరోలియో కంపోజ్‌ చేశారు. ఇక ముఖ్యంగా సింగర్స్‌ ఈ పాటకు ప్రాణం పోశారు. శాంతి పీపుల్‌, నోవ్‌లిక్‌ పాటను పాడిన విధానం చాలా బాగా ఆకట్టుకుంటోంది. అమ్మాయిల వాయిస్‌కు నెటిజన్లు ఎంతగానో ఫిదా అవుతున్నారు.


ఇక ఈ రావణాసుర ఆంథెమ్‌ సాంగ్ గూస్‌బంప్స్ తెప్పించేలా సాగుతూ కథ ఏంటన్నదానిపై చాలా ఆసక్తిని పెంచేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌ విలన్‌గా నటిస్తున్న సంగతి ఎలిసిందే. అభిషేక్ పిక్చర్స్‌, రవితేజ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాని 2023 ఏప్రిల్‌ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. మరి ధమాక లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.ధమాక సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేగాక రవితేజ కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల వసూళ్లు చేసిన సినిమాగా కూడా ధమాక నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీలకి కూడా యూత్ లో విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: