పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లవ్ హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న తలపతి విజయ్ హీరో గా రూపొందిన తేరి అనే తమిళ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందబోతుంది. ఈ మూవీ రీమేక్ మూవీ అయినప్పటికీ ఈ మూవీ ఒరిజినల్ కథకు అనేక మార్పులను ... చేర్పులను చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ మూవీ ని రూపొందించ బోతున్నట్లు తెలుస్తోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించనుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించనున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ఏప్రిల్ నెల నుండి ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అలాగే ఏప్రిల్ నెలలో ఈ మూవీ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ కాబోతున్నట్లు ... పవన్ కళ్యాణ్ తో ఈ మూవీ యూనిట్ కీలక సన్నివేశాలను ఏప్రిల్ నెలలో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: