
అంతలా ఈ సినిమా ప్రతి ఒక ప్రేక్షకుడి మదికి కనెక్ట్ అయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా లోని రెండు లవ్ స్టోరీస్ కూడా ప్రేక్షకుల హృదయాలను మెలిపెట్టి కన్నీళ్లు తెప్పించాయి అని చెప్పాలి. అది సరేగాని ఇక ఇప్పుడు రాజారాణి సినిమా గురించి ఎందుకు చర్చ వచ్చింది? ఏదైనా విశేషం ఉందా అని అంటారా.. విశేషం ఉంది కాబట్టే ఈ సినిమా పేరు ప్రస్తుతం చర్చకు వచ్చింది. ఈ సినిమాలో నయనతార- జై జోడిగా నటించారు. వీరిద్దరి లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
ఇక ఇప్పుడు రాజారాణి సినిమా ప్రేక్షకుల ముందుకు ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఇక ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ హిట్ జోడి మరోసారి ప్రేక్షకులను అలరించబోతుంది. జై పుట్టినరోజు సందర్భంగా నయనతార 75వ సినిమాలో జై హీరోగా నటిస్తున్నట్లు జి స్టూడియోస్ నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీంతో ఇక వీరి జోడిని మళ్ళీ తెరపై చూసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందట. ఈ సినిమా అప్డేట్ తోనయనతార పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిందన్న ప్రచారానికి చెక్ పడింది.