ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన వార్త ఇదే.  ఓజీ సినిమా విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రామ్ చరణ్ కూడా రిపీట్ చేశాడా? అన్న చర్చ బాగా హడావుడి చేస్తోంది. ఇది అందరికి తెలిసిన విషయమే.  ప్రస్తుతానికి రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది  సినిమా షూట్‌తో బిజీగా గడుపుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూట్ కి టాటా బై బై చెప్పేసి ఆయన తన  నెక్స్ట్ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని రావాలని చూస్తున్నారట.  సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న “రంగస్థలం 2” మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నారని సమాచారం అందుతుంది. ఈ విషయమై ఇప్పటికే టాలీవుడ్‌లోనూ, సోషల్ మీడియాలోనూ హైప్ క్రియేట్ అయిపోయింది.


ఇక ఈ సీక్వెల్‌లో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. మొదటి రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి పోషించిన పాత్రను, ఈసారి కోలీవుడ్ స్టార్ అర్జున్ దాస్ పోషించబోతున్నాడు అని తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, ఆది పినిశెట్టి ఆ పాత్రలో ఇచ్చిన ఇంపాక్ట్ సినిమాకి ఎంత పెద్ద పాజిటివ్ టాక్ ఇచ్చిందో. అదే స్థాయిలో స్ట్రాంగ్ రోల్‌ను ఈ సారి సుకుమార్, అర్జున్ దాస్ కోసం రాసినట్లు సమాచారం.అర్జున్ దాస్ ఇప్పటికే “ఓజి” సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేశారు. ఆయనకి ఉన్న బేస్ వాయిస్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల క్యారెక్టర్ మరింత హైలైట్ అవుతుంది అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అందుకే సుకుమార్ కూడా ఈసారి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అతడికి ఇచ్చేశారని అంటున్నారు.



ఈ వార్త బయటకు రావడంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ హంగామా చేస్తున్నారు. "పవన్ కళ్యాణ్ ఓజీ విషయంలో ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు… ఇప్పుడు రామ్ చరణ్ కూడా రంగస్థలం 2 విషయంలో అలాంటి డెసిషన్ తీసుకున్నాడు. బాబాయ్–అబ్బాయి ఇద్దరూ ఒకే తరహా స్టెప్స్ వేస్తున్నారు. వీళ్లకి ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి?" అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక సుకుమార్ స్టైల్‌కి, రామ్ చరణ్ మాస్ అటిట్యూడ్‌కి, అర్జున్ దాస్ విలన్ ఇంపాక్ట్‌కి రంగస్థలం 2లో ఒక కొత్త రేంజ్ హైప్ క్రియేట్ అవుతుందని టాక్ నడుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: