ఇటీవల కాలంలో చాలా మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని , సరికొత్త పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ భావితరాల వారికి డబ్బులు ఆదా చేస్తున్నారు. అంతేకాదు మరికొంతమంది పెన్షన్ కోసం కూడా డబ్బులను ఆదా చేయాలి.. అని అనుకుంటున్నారు. అయితే అలాంటి వారికి పి ఎఫ్ ఆర్ డి ఏ తాజాగా ఒక తీపి కబురు అందించింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ ఎన్పీఎస్ స్కీమ్లో లో ఇప్పటికే భాగస్వాములైన వారికి ఒక శుభవార్త తెలిపింది

శుభవార్త ఏమిటంటే, లబ్ధిదారులకు చెల్లింపులు ఇకపై ఆలస్యం కాకుండా, అనుకున్న సమయానికి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా NPS లో భాగమైన వారికోసం ఈ పి ఎఫ్ ఆర్ డి ఏ ఇటీవల పెన్ని డ్రాప్ ఫీచర్ ను  ప్రవేశపెట్టింది. దీనిద్వారా తక్షణమే మీ బ్యాంక్ ఖాతాలను వెరిఫై చేసుకోవచ్చు. ఇలా వెరిఫై చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి..? అంటే విత్డ్రా సమయంలో మీ పని మరింత సులభం అవుతుంది. అంతేకాదు కొత్తగా ఎవరైతే ఈ టీం లో చేరి ఉంటారో, వారు కూడా ఎలాంటి సందేహం లేకుండా మీ బ్యాంకు ఖాతా యాక్టివ్ గా ఉందా..? లేదా..? అనే విషయాలను కూడా మీరు పరిశీలించుకోవచ్చు.

ఇక ఎవరైతే ఈ NPS పథకంలో చేరినవారు నిర్ణీత  సమయంలో డబ్బులు విత్డ్రా చేసుకునేటప్పుడు , ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా బ్యాంకు ఖాతాలో డబ్బు జమ కాకపోయినా ఇదే కారణం అయి ఉండవచ్చు. అంతేకాకుండా ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఇవ్వడం , పేరు మ్యాచ్ అవ్వకపోవడం, ఇక బ్యాంక్ అకౌంట్ కూడా ఇన్ యాక్టివ్ గా ఉండటం వంటి కారణాల వల్ల కూడా మన డబ్బులు రాకపోవచ్చు. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఎన్ పీ  ఎస్ ఈ వెరిఫికేషన్ ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: