ప్రస్తుత కాలంలో అన్ని బ్యాంకులు కూడా డెబిట్ కార్డు ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక బ్యాంకు వినియోగదారులు తమ డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన మొత్తాలు ఒక నిర్దిష్ట మొత్తం కనుక దాటితే దాన్ని ఈఎంఐ కింద మార్చుకోవచ్చునట.అలాగే వివిధ రకాల బ్యాంకుల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు అనుగుణంగా ఆ నిర్దిష్టమైన మొత్తం అనేది మారుతుంది. అయితే ఎస్‌బీఐ కూడా డెబిట్ కార్డు ఈఎంఐ సదుపాయాన్ని ఇప్పుడు వినియోగదారులకు అందిస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఎస్‌బీఐ డెబిట్ కార్డు ద్వారా ఈఎంఐ సదుపాయాన్ని ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకోండి.ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఈఎంఐ కస్టమర్లు అందరికి కూడా అందుబాటులో ఉండదు. కొందరు ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఎవరైనా సరే తమకు ఈ సౌకర్యం అనేది అందుబాటులో ఉందా, లేదా ? అనేది ముందుగా తెలుసుకోవాలి.

ఇక అందుకు గాను DCEMI అని టైప్ చేసి 567676 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ చెయ్యాలి. దీంతో అర్హులైతే వెంటనే మీ ఫోన్ కి మెసేజ్ అనేది వస్తుంది. అందులో క్రెడిట్ లిమిట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ విధంగా ఎస్బీఐ వినియోగదారులు తాము డెబిట్ కార్డు ఈఎంఐకి అర్హులు అవునో, కారో ఈజీగా తెలుసుకోవచ్చు.అయితే ఆన్‌లైన్‌లో ప్రతి దానిని కూడా డెబిట్ కార్డు ఈఎంఐ ద్వారా కొనలేరు. కొన్ని ఎంపిక చేసిన వస్తువులకు మాత్రమే కేవలం ఈ సదుపాయం అనేది ఉంటుంది. కాబట్టి ప్రొడక్ట్ పేజీలో పేమెంట్ ఆప్షన్లలో డెబిట్ కార్డు ఈఎంఐ ఉందో, లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉంటే కనుక ఆ ప్రొడక్ట్ ను ఈజీగా కొనుగోలు చేయవచ్చు. ఇక కొనుగోలు చేసే సమయంలో మీకు కావల్సినన్ని నెలల పాటు అందులో సూచించిన విధంగా ఈఎంఐ అనేది మీరు పెట్టుకోవచ్చు.ఇక దీంతో మీ పేమెంట్ అనేది జరిగిపోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: