అర్హులందరికీ సంతృప్తి స్థాయిలో పథకాలను అందించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా పీఎం కిసాన్, ఉజ్వల, ఫసల్ బీమా, గరీబ్ కళ్యాణ్ అన్న యువజన తదితర పథకాలను సైతం అర్హులను గుర్తించి లబ్ధిదారులకు చేకూర్చే విధంగా..2.7 లక్షల పంచాయతీ కార్యక్రమాలలో వికసిత్ భారత్ సంకల్పన యాత్ర చేయబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 15వ తేదీ నుంచి పీఎం నరేంద్ర మోడీ పలు గిరిజన ప్రాంతాలలో పైరేట్ ప్రాజెక్టులను సైతం ప్రారంభిస్తున్నట్లు సమాచారం. మిగతా జిల్లాలలో నవంబర్ మూడో వారం నుంచి ఈ దశ ప్రారంభిస్తారట.
ఇటీవల కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అందుకు తగ్గిన ఏర్పాటు కూడా చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన జవహర్ రెడ్డి కలెక్టర్లతో సైతం వీడియో కాన్ఫరెన్స్ తో మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచారానికి తగ్గట్టుగా పలు చర్యలు తీసుకోవాలని అధికారులను సైతం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రత్యేకమైన ఒక నోడల్ అధికారిని కూడా ఏర్పరిచినట్లు సమాచారం.
శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వారంలో 14 గ్రామపంచాయతీలు, గ్రామ, వార్డు సచివాలయాలలో యాత్ర కొనసాగించే విధంగా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. నవంబర్ 20వ తేదీ నుంచి ప్రతిపాదిత వికసిత్ భారత సంకల్ప యాత్ర కోసం పరిచర్యలు చేపట్టబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ కార్యక్రమం 5 ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో జరగకుండా చూసుకోవాలని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మోడల్ ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న ఎన్నికలకు రాష్ట్రాలలో సైతం ఈ యాత్ర జరగదని ఎన్నికలు ముగిసిన తరువాత పలు రాష్ట్రాలలో ప్రారంభించబోతున్నట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో పథకాలు అందరివారికి శుభవార్త తెలుపుతోందని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి